నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 162 పోస్టులు భర్తీ చేయనుండగా, ఇందులో(AP) ఆంధ్రప్రదేశ్‌కు 8 పోస్టులు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (NABARD)దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమై ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది.
Read also: US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

ఎంపిక విధానం
అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
- ప్రిలిమినరీ రాత పరీక్ష
- మెయిన్ రాత పరీక్ష
- లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్
పరీక్షల తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 2
- మెయిన్ పరీక్ష: ఏప్రిల్ 12
దరఖాస్తు ఫీజు
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.550
- ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు: రూ.100
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం www.nabard.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నాబార్డ్ సూచించింది.
ఈ నోటిఫికేషన్ బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: