టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ఎన్ చంద్రశేఖరన్ (N Chandrasekaran) 2024-25 వార్షిక సంవత్సరంలో 155.81 కోట్ల వేతాన్ని ఆర్జించారు. గత వార్షిక సంవత్సంతో పోలిస్తే ఆ మొత్తం 15 శాతం పెరిగింది (Increased by 15 percent). 2024 వార్షిక సంవత్సరానికి చంద్రశేఖరన్ (N Chandrasekaran)135 కోట్లు ఆర్జించారు. కంపెనీ వార్షిక రిపోర్టు ద్వారా ఈ విషయం తెలిసింది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఆయన జీతం రూపంలో 15.1 కోట్లు, ఇక ఇతర కమీషన్, లాభాల్లో భాగంగా 140.7 కోట్లు ఆర్జించారు. వాస్తవానికి గత వార్షిక సంవత్సరంలో టాటా సన్స్ కంపెనీ తన లాభాల్లో 24.3 శాతం కోల్పోయింది. అయితే అలాంటి సమయంలో టాటా సన్స్ చైర్మెన్‌కు (N Chandrasekaran) జీతాన్ని పెంచడం చర్చనీయాంశమైంది. గత ఏడాది టాటా సన్స్ లాభాలు 34,654 కోట్ల నుంచి రూ.26,232 కోట్లకు పడిపోయాయి.

టాటా సన్స్‌లో చేస్తున్న ఇతరు ఉద్యుగుల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ్ అగర్వాల్ 2025 వార్సిక సంవత్సరంలో 32.7 కోట్లు ఆర్జించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 7.7 శాతం ఎక్కువ. రతన్ టాటా మృతి తర్వాత టాటా సన్స్‌లో చేరిన నోయల్ టాటాకు 1.42 కోట్ల కమీషన్ వచ్చింది. 2025 మార్చిలో రిటైర్ అయిన మాజీ బోర్డు సభ్యుడు లియో పురికి 3.13 కోట్ల కమీషన్ వచ్చింది. 2024 ఆగస్టులో రిటైర్ అయిన భాస్కర్ భట్ 1.33 కోట్ల కమీషన్ అందుకున్నారు.
టాటా సన్స్ అతి పిన్న వయస్కుడైన చైర్మన్ ఎవరు?
1938. టాటా సన్స్ ఛైర్మన్‌గా JRD నియమితులయ్యారు; 34 సంవత్సరాల వయస్సులో , ఆయన ఇప్పటివరకు నియమితులైన అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్.
టాటా సన్స్ నామినీ ఎవరు?
టాటా సన్స్ బోర్డులో ట్రస్ట్ నామినీగా నోయెల్ టాటా చేరారు. నోయెల్ టాటా నియామకంతో, టాటా సన్స్ దశాబ్ద కాలం తర్వాత టాటా కుటుంబం నుండి తొలిసారిగా డ్యూయల్ బోర్డు సభ్యుడిని చూసింది, రతన్ టాటా మరణం తర్వాత నాయకత్వంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది.
టాటా సన్స్ చైర్మన్ పదవీ విరమణ వయస్సు?
టాటా సన్స్ స్థాపించబడిన పదవీ విరమణ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. పిరమల్ ఆగస్టు 2016లో బోర్డు సభ్యుడయ్యారు. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA) ప్రకారం, ఎగ్జిక్యూటివ్ పదవులను కలిగి ఉన్నవారు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేస్తారు, అయితే బోర్డు స్థాయి పదవులకు పదవీ విరమణ వయస్సు 70
Read hindi news: hindi.vaartha.com
Read Also: Railway ASM Exam: రైల్వే ఎఎస్ఎం పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసు