పెట్టుబడిదారులకు ఇది నిజంగా శుభవార్త. దేశవ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో బీఎస్ఈ (BSE) – ఇండియా పోస్ట్ (India Post) కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో దేశంలో ఉన్న 1.64 లక్షలకు పైగా పోస్టాఫీసుల్లో (Post Offices) మ్యూచువల్ ఫండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు పట్టణాలు, మెట్రో నగరాలకే పరిమితమైన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి అవకాశాలు ఇకపై గ్రామీణ,
Read Also: Special Trains: సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు

ఏజెంట్లకు శిక్షణ
సెమీ-అర్బన్ ప్రాంతాల ప్రజలకు కూడా సులభంగా పెట్టుబడి అవకాశాలు లభించనున్నాయి. బీఎస్ఈ స్టార్ MF ప్లాట్‌ఫామ్‌ను పోస్టాఫీసుల ద్వారా వినియోగించుకోవచ్చు. ఎంపిక చేసిన పోస్టల్ (Post Offices) ఉద్యోగులు, ఏజెంట్లకు శిక్షణ ఇచ్చి పెట్టుబడిదారులకు మార్గదర్శకత్వం అందించనున్నారు. దీంతో ఆర్థిక అక్షరాస్యత మరింత పెరుగుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: