ముంబయి (Mumbai) నగరంలోని బోరివలి, థానే, కల్యాణ్, ములుండ్, పోవై, సాంటాక్రూజ్, చెంబూర్, వర్లీ, నవి ముంబయి, కొలాబా ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇది వాతావరణ శాఖ అందించే నాలుగు స్థాయిల హెచ్చరికల్లో (Mumbai) మూడవ స్థాయి. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కూడా ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్‌లు కొనసాగుతున్నాయి.
IMD హెచ్చరించింది
IMD తెలిపిన వివరాల ప్రకారం, ముంబయిలో గంటకు 5 నుండి 15 మిల్లీమీటర్ల వర్షం పడే అవకాశం ఉంది. ప్రధానంగా మోస్తరు వర్షాలు మరియు తక్కువ స్థాయి గాలి వానలు నమోదవుతాయని అంచనా. ఆదివారం ఉదయం వర్షం తీవ్రత కొంత తగ్గినప్పటికీ, మళ్లీ వాతావరణం మేఘావృతంగా మారి, కొన్ని చోట్ల తీవ్ర వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ప్రజల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇక శనివారం ముంబయిలో భారీ వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. రాత్రంతా వర్షం కొనసాగడంతో లోకల్ ట్రైన్లు నిలిచిపోయాయి, ప్రజల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విక్రోలి పార్క్‌సైట్ ప్రాంతంలో మట్టిపెళ్లలు పడి ఇద్దరు మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
ఇక ఇతర ప్రాంతాల్లో కూడా హెచ్చరికలు ఉన్నాయి.
కోలాపూర్, అమరావతి, వర్ధా, నాగపూర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. నాశిక్, ఖండాలా, భీమశంకర్ రిజర్వ్, పుణే, మహాబలేశ్వర్, కోలాపూర్, సతారా ప్రాంతాలకు కూడా వర్షాల హెచ్చరికలు జారీ చేశారు.
ముంబయి నగర వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికార యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే రోజుల్లో వర్షాల పరిస్థితి ఎలా మారుతుందన్నది ముంబయి నగరంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
Read also: