దేశంలోని ప్రధాన నగరాల్లో మహిళల భద్రత మరింత కలవరపరుస్తోంది. ప్రతిష్టాత్మక ఉద్యోగాలు చేసే మహిళలనుంచి సాధారణ యువతుల(Youth) వరకు, వేధింపులు మరియు దాడులకు గురవుతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబైలో చోటుచేసుకున్న ఓ మహిళా వ్యాపారవేత్తను బెదిరించి, నగ్నంగా చేసి వీడియోలు రికార్డు చేయగా, మరొక సంఘటనలో క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న యువతిని పరిచయస్తులే కారులోకి ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు.
Read Also: Sanchar Saathi App: కొత్త స్మార్ట్‌ఫోన్లలో ‘సంచార్ సాథీ’ తప్పనిసరి!

ముంబైలో ఫార్మా సంస్థ అధికారి హింసాచారం
ముంబై(Mumbai)కి చెందిన 51 ఏళ్ల వ్యాపారవేత్త మహిళ పోలీసులకు చేసిన ఫిర్యాదులో, ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జాయ్ జాన్ పాస్కల్ తనను తీవ్రంగా వేధించారని తెలిపారు. సమావేశం పేరుతో కార్యాలయానికి పిలిచి, ప్రాణహాని హెచ్చరికల మధ్య దుస్తులు విప్పాలని బలవంతపర్చాడని ఆమె వెల్లడించారు.
ఈ సమయంలో నిందితుడు అసభ్యంగా దూషిస్తూ తన నగ్న చిత్రాలు, వీడియోలు తీసినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించాడని చెప్పింది. ఈ దారుణ ఘటనపై బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. లైంగిక వేధింపులు, దాడి, క్రిమినల్ బెదిరింపులు వంటి పలు అభియోగాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: