మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న GEN Z యువత చేసే విపరీత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయి. బైక్ స్టంట్‌లతో ప్రాణాలు కోల్పోవడం ఒకవైపు ఉంటే, ఇప్పుడు పుట్టినరోజు వేడుకల పేరుతోనూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. కేక్‌ను ముఖానికి పూయడం, స్ప్రే వేసి నిప్పంటించడం, మురికి కాలవలో తోయడం వంటి యావగింపు పనులతో సమాజాన్ని కంపు కొడుతున్నారు, చివరకు కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు.
Read Also: Cyclone Ditwah Tamil Nadu : తుఫాన్ వల్ల చెన్నైలో స్కూల్స్, కాలేజీలకు గురువారం సెలవు…
ముంబైలో (Mumbai) కొందరు యువకులు ‘బర్త్ డే బంప్స్’ (Birthday bumps) పేరుతో హద్దులు దాటారు. పుట్టినరోజు సందర్భంగా వారు చేసిన ఓ నీచపు పని ఒక యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రస్తుతం ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

స్నేహితుడిపై రాళ్ల దాడి, పెట్రోల్ పోసి నిప్పంటించిన దురాగతం
గత నెల 24న అబుల్ రెహమాన్ అనే యువకుడి పుట్టినరోజు. అతడి స్నేహితుల బ్యాచ్‌లో ఉన్న అయాజ్ మాలిక్ అబుల్‌కు ఫోన్ చేసి కేక్ కట్ చేద్దామని కోహినూర్ ఫేజ్ 3 సొసైటీలోని వింగ్ నంబర్ 26 వద్దకు పిలిపించాడు. అప్పటికే అక్కడున్న అయాజ్ మాలిక్, అష్రఫ్ మాలిక్, ఖాసిం చౌదరి, హుజైఫా ఖాన్, షరీఫ్… కలిసి అబుల్‌తో కేక్ కట్ చేయించారు.
కేక్ కట్ అయిన తర్వాత, ముందుగానే ప్లాన్ చేసుకున్న ఆ బ్యాచ్. అబుల్‌పై రాళ్ల దాడికి తెగబడింది. అక్కడితో ఆగకుండా, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను కూడా అబుల్‌పై పోశారు. భయంతో అబుల్ పరుగులు తీయగా, పట్టుకునే క్రమంలో అయాజ్ తన వద్ద ఉన్న లైటర్‌తో అబుల్‌కు నిప్పంటించాడు. దీంతో అబుల్ బట్టలు కాలిపోయాయి.
తీవ్రగాయాలు: ఐదుగురిపై కేసు నమోదు, అరెస్టు
మంటలతో ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీస్తున్న అబుల్‌ను గమనించిన పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డు వెంటనే అతనిపై నీళ్లు పోశాడు. అయినప్పటికీ మంటలు చల్లారకపోవడంతో, అబుల్ పక్కనే ఉన్న కుళాయి దగ్గరకు వెళ్లి మంటలు ఆరే వరకు నీళ్లు పోసుకున్నాడు.
ఈ దాడిలో అబుల్‌కు ముఖం, చెవులు, జుట్టు, ఛాతీ, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు బాధితుడి స్నేహితులపై కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: