మధ్యప్రదేశ్(MP Diamond Discovery) రాష్ట్రంలోని పన్నా జిల్లాకు చెందిన గిరిజన కూలీ గోవింద్ సింగ్ జీవితంలో అద్భుతం చోటు చేసుకుంది. ప్రతిరోజు మాదిరిగానే ఖేర్ మాత ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు పక్కన ఒక మెరిసే రాయి కనిపించింది. ఆసక్తితో దాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు చూపించాడు. తర్వాత అది సాధారణ రాయి కాదని, అసలైన 4.04 క్యారెట్ల విలువైన వజ్రం అని తేలింది.
Read also: Breaking News – Vote Chori : జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు

వజ్రం విలువ మరియు ప్రభుత్వ చర్య
గోవింద్ సింగ్ ఆ రాయిని వెంటనే పన్నా వజ్ర కార్యాలయానికి(Panna, Madhya Pradesh) తీసుకెళ్లాడు. అక్కడ నిపుణుడు అనుపమ్ సింగ్ అది అత్యున్నత నాణ్యత కలిగిన వజ్రమని ధృవీకరించారు. ఈ వజ్రం(MP Diamond Discovery)త్వరలో వేలం వేయనున్నారు. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో 11.5% రాయల్టీ ప్రభుత్వానికి వెళ్తుంది. మిగిలిన మొత్తం గోవింద్ సింగ్ ఖాతాలో జమ కానుంది.
గోవింద్ సింగ్ కొత్త కలలు
కూలీగా, చిన్న రైతుగా జీవించే గోవింద్ సింగ్‌కి ఇది జీవితాన్ని మార్చిన అదృష్టం. తన సంతోషాన్ని పంచుకుంటూ ఆయన అన్నారు –
“మాతా రాణి కృపతో నాకు ఈ వజ్రం దొరికింది. వచ్చిన డబ్బుతో ముందుగా మా ఇంటి నిర్మాణం పూర్తిచేస్తాను. ఇంకా డబ్బు మిగిలితే కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేస్తాను.”
పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి ఉన్నా, ఇలాంటివి సాధారణ కూలీకి దొరకడం అత్యంత అరుదైన సంఘటనగా మారింది.
వజ్రం దొరికిన వ్యక్తి ఎవరు?
మధ్యప్రదేశ్ పన్నా జిల్లాకు చెందిన గోవింద్ సింగ్.
వజ్రం బరువు ఎంత?
4.04 క్యారెట్లు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: