ముంబై మోనోరైల్ (Mumbai Monorail) సేవల్లో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. వాడాలా దిశగా వెళ్తున్న రైలు సోమవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే – ఉదయం సుమారు 7.16 గంటల సమయంలో ఆంటోఫిల్ బస్ డిపో – జీటీబీ నగర్ స్టేషన్ల మధ్య రైలు నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోగీల్లో లైట్లు ఆరిపోయి, ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ప్రయాణికుల్లో కొంతమంది పరిస్థితిని గ్రహించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే అధికారులకు సమాచారం అందించగా, ముంబై అగ్నిమాపక దళం, రైల్వే రక్షణ బృందం కూడా రంగంలోకి దిగాయి. రైలు (Rail) మధ్యలో నిలిచిపోవడం వల్ల బోగీల్లో వాతావరణం వేడెక్కింది.అయితే అధికారులు త్వరితగతిన స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని
సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి రైలులో చిక్కుకున్న 17 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు. వారిని అక్కడి నుండి మరో మోనోరైల్లోకి ఎక్కించి.. వారిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.అనంతరం సాంకేతిక లోపం (Technical error) తో ఆగిపోయిన రైలును టో చేసి పక్కకు తీసివేశారు. ఉదయం 8:50 గంటల నాటికి సాధారణ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
అయితే సంత్ గాడ్గే మహారాజ్ చౌక్, వాడాలా మధ్య మోనోరైల్ సేవలు ఉదయం 9:15 గంటల తర్వాత నడవగా.. వాడాలా-చెంబూర్ మార్గంలో మాత్రం రైళ్లు యథావిధిగా నడిచాయని మోనోరైల్ ప్రతినిధి ఒకరు తెలిపారు.గత రెండు నెలల్లో మోనోరైల్ సేవలకు అంతరాయం కలగడం రెండోసారి. దీనితో మోనోరైల్ సేవలు, వాటి నిర్వహణపై ప్రయాణికులలో ఆందోళన వ్యక్తం అవుతోంది.

మోనోరైల్ సేవలకు అంతరాయం కలగడం రెండోసారి
గత నెల ఆగస్టు 18వ తేదీన భారీ వర్షాల కారణంగా విద్యుత్ సరఫరా (Power supply) నిలిచిపోవడంతో రెండు మోనోరైళ్లు ఆగిపోయాయి. కరెంటు లేక, ఏసీలు పనిచేయక ప్రయాణికులు నరకం చూశారు. ఊపిరాడక చాలామంది అస్వస్థతకు గురయ్యారు.
అగ్నిమాపక సిబ్బంది వచ్చి కిటికీలు పగలగొట్టి మరీ రెండు రైళ్లలో చిక్కుకుపోయిన 782 మందిని సురక్షితంగా కాపాడారు. ఇది జరిగిన మూడ్రోజులకే అంటే ఆగస్టు 21వ తేదీనే ఆచార్య ఆత్రే నగర్ స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల 15 నిమిషాల పాటు సేవలు నిలిచిపోయాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: