రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ ఖాతాలో జరిగిన అసాధారణ లావాదేవీలు కేంద్ర దర్యాప్తు సంస్థ EDను ఉలిక్కిపడేలా చేశాయి. 2024 ఆగస్టు 19 నుంచి 2025 ఏప్రిల్ 16 వరకు కేవలం ఎనిమిది నెలల్లోనే రూ.331.36 కోట్లు జమ కావడం అధికారులు తీవ్ర అనుమానాలకు గురిచేసింది. మనీలాండరింగ్(Money Laundering Case) దర్యాప్తులో భాగంగా, 1xBet అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్ డబ్బు జాడను ట్రాక్ చేస్తూ, ఈ ఖాతా ఆకస్మికంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకు రికార్డుల్లో ఉన్న చిరునామాను పరిశీలించగా, ఈడీ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ డ్రైవర్ ఢిల్లీలోని(Delhi) చిన్న రెండు గదుల ఇంట్లో నివసిస్తూ, రోజువారీ అవసరాల కోసం బైక్‌తో రాపిడో రైడ్స్ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నట్లు గుర్తించారు. అతని జీవన శైలికి ఈ భారీ మొత్తాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.
Read also: KTR: కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు

లగ్జరీ వెడ్డింగ్, గుజరాత్ లీడర్.. దర్యాప్తును మరింత క్లిష్టం చేసిన అంశాలు
ED దర్యాప్తులో మరో సంచలనం బయటపడింది. ఈ ఖాతాలో జమైన డబ్బులో ₹1 కోట్లకుపైగా ఉదయపూర్‌లో నిర్వహించిన ఒక లగ్జరీ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వివాహం గుజరాత్‌కు చెందిన యువ రాజకీయ నాయకుడితో సంబంధం ఉందని సమాచారం. అతనిని త్వరలో విచారణ కోసం పిలవనున్నట్టు ED వెల్లడించింది. డ్రైవర్ మాత్రం ఈ లావాదేవీల గురించి పూర్తిగా తెలియదని, ఖాతా ద్వారా డబ్బు వినియోగించిన వ్యక్తులను కూడా ఎప్పుడూ చూసి ఉండలేదని అధికారులకు చెప్పాడు. దీన్ని బట్టి అతని ఖాతాను మ్యూల్ అకౌంట్ గా — అంటే, అక్రమ డబ్బు తరలింపులకు ఉపయోగించే ఖాతాగా ఉపయోగించారని ED భావిస్తోంది. దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం, ఈ ఖాతాలోకి అనేక తెలియని మూలాల నుండి భారీ మొత్తం జమయి, వెంటనే ఇతర అనుమానాస్పద ఖాతాలకు బదిలీ అయ్యింది. వాటిలో ఒకటి నేరుగా ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌కి సంబంధం ఉన్నట్లు స్పష్టమైంది.
దర్యాప్తు వేగవంతం… ప్రముఖులపై కూడా కంటి గన్ను
Money Laundering Case: 1xBet బెట్టింగ్ కేసు నేపథ్యంలో, ED ఇప్పటికే పలు ప్రముఖుల ఆస్తులను అటాచ్ చేసింది. ఇటీవల క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనా ల ఆస్తులు కూడా సీజ్ చేయబడ్డాయి. దీనితో దర్యాప్తు మరింత విస్తృతమవుతోంది. నిధుల అసలు మూలం, వాటి లబ్ధిదారులు, ప్రయోజనం పొందిన రాజకీయ–వ్యాపార వర్గాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో ప్రధాన అనుమానం ఏమిటి?
రాపిడో రైడర్ బ్యాంకు ఖాతాను మనీలాండరింగ్ కోసం మ్యూల్ అకౌంట్‌గా ఉపయోగించారనే అనుమానం.
మొత్తం ఎంత డబ్బు జమ అయింది?
ఎనిమిది నెలల్లో ₹331 కోట్లకు పైగా.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/