2008లో మాలేగావ్ లో చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలు, విచారణలో ఎదురైన ఒత్తిడులపై మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్ (Mahbub Mujaw) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి.
పేలుడు ఘటన – ఓ దురదృష్టకర సంఘటన
2008 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని మాలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ మసీదు సమీపంలో జరిగిన బాంబు పేలుడు తీవ్ర ఆందోళన కలిగించింది. మోటార్ సైకిల్‌కు అమర్చిన బాంబు విస్ఫోటనం వల్ల ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు, మరో 100 మందికిపైగా గాయపడ్డారు.

ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులు
ఈ కేసులో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ శ్రికాంత్ పురోహిత్, రమేష్ ఉపాధ్యాయ, సుధాకర్ ద్వివేది వంటి వ్యక్తులు ప్రధాన నిందితులుగా పేర్కొనబడ్డారు. అయితే ముంబయిలోని ప్రత్యేక కోర్టు వీరిని నిర్దోషులుగా ప్రకటించింది.
మహబూబ్ ముజావ్ సంచలన ఆరోపణలు
ఈ కేసులో కీలకంగా పని చేసిన మాజీ ఏటీఎస్ అధికారి మహబూబ్ ముజావ్ తాజాగా సంచలన విషయాలను వెల్లడించారు. తనపై ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఆరెస్సెస్ అధిపతి మోహన్ భగవత్ (Mohan Bhagwat) తో పాటు మరికొంతమందిని అరెస్టు చేయాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆయన అన్నారు. వారి టార్గెట్ అయిన వారు — రామ్ కల్సంగ్రా, సందీప్ దాంగే, దిలీప్ పాటిదార్, మరియు మోహన్ భగవత్ (Mohan Bhagwat) అని స్పష్టం చేశారు.
‘మోహన్ భగవత్‌ను అరెస్ట్ చేయమన్నారని’’ వెల్లడి
ముజావ్ ప్రకారం, అప్పటి ఏటీఎస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్ తో పాటు మరికొంతమంది అధికులు తనకు నేరుగా ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
మద్దతుగా ప్రభుత్వ సిబ్బంది, ఆయుధాల వ్యవహారం
ఈ దర్యాప్తులో భాగంగా, ముజావ్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 మంది సిబ్బంది, అవసరమైన నిధులు, మరియు రివాల్వర్ కూడా ఇవ్వబడ్డాయని వెల్లడించారు. ఇది తనకు ఏ స్థాయిలో ఒత్తిడి వచ్చిందో స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత వాటన్నింటిలో తాను నిర్దోషిగా బయటకు వచ్చానని ఆయన వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: