Modi-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరాం మొట్టమొదటి రైల్వేలైన్ ను ప్రారంభించారు. బైరాబీ-గేజ్ ప్రాజెక్టును వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం దాన్ని జాతికి అంకితం చేశారు. ఇది మిజోరాం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అన్నారు మోదీ. ఈ రైల్వేలైన్ నిర్మాణం(Railway line construction)కోసం రూ.8.070 కోట్లు ఖర్చు చేశారు. ఇది భారతీయ రైల్వే చరిత్రలోనే కాక ప్రపంచంలోనే అతికష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా రికార్టుల్లోకెక్కింది. 51.38 కి.మీ పొడవైన ఈ రైల్వే లైన్ 45 భారీ సొరంగాలు, 153 బ్రిడ్జిలను కలిగి ఉంది.

యువతకు ఉపాధి అవకాశాలు
ఈ ప్రాజెక్టు ద్వారా మిజోరంలో పర్యాటకం, వాణిజ్యం గణనీయంగా పుంజుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav)మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును రూ 8,070 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని తెలిపారు. 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలతో ఈ మార్గం నిర్మాణం అత్యంత సవాలుగా సాగిందని ఆయన వివరించారు. రైల్వే ప్రాజెక్టుతో పాటు ప్రధాని మోది పలు కీలక రహదారులకు కూడా శంకుస్థాపన చేశారు. ఐజ ద్విల్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లతో నిర్మించనున్న ఐజ్వాల్ బైపాస్ రోడ్, తెస్ట్రాల్-సియాల్ుక్, ఖాన్కాన్-రొంగురా రహదారుల పనులకు శ్రీకారం చుట్టారు. వీటితోపాటు ఐజ్వాల్లోని మువాలాంగ్ లో ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్కు , క్రీడాభివృద్ధి కోసం ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ హాల్ కు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు మిజోరం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చటంలో కీలకపాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.
ఈ ప్రాజెక్ట్ ఏ ప్రాంతంలో ప్రారంభించబడింది?
ఈ ప్రాజెక్ట్ ఐజ్వాల్‌లో ప్రారంభించబడింది.
ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?
ప్రాంతీయ అభివృద్ధి, స్థానిక ఉపాధి సృష్టించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం.
Read hindi news: hindi.vaartha.com
Read also: