భారత్–పాక్ మధ్య యుద్ధం తానే ఆపినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రాన్ని ఉద్దేశించి కఠినంగా స్పందిస్తోంది. ట్రంప్ ఇదే విషయాన్ని ఇప్పటికే 23 సార్లు చెబుతున్నారని పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ పేర్కొన్నారు.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ట్రంప్ ,వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో సమాధానం ఇవ్వాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది.జైరామ్ రమేశ్ (Jairam Ramesh), ట్రంప్, అణు యుద్ధం ఆపానని పదే పదే చెబుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. ఈ అంశంపై మోదీ రాజ్యసభలోనైనా, లోక్‌సభలోనైనా జవాబు చెప్పాలి, అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

23 సార్లు అదే వ్యాఖ్య – ఎందుకు మౌనం?
డొనాల్డ్ ట్రంప్ తరచూ ఒకటే మాట చెబుతున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తానే నివారించానని స్పష్టం చేస్తున్నారు. ఇంతటి కీలకమైన విషయం మీద భారత ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంపై కాంగ్రెస్ ప్రశ్నలు వేస్తోంది.ఇలాంటి వ్యాఖ్యలు దేశ భద్రతకు సంబంధించినవి. ఇవి అంత తేలికగా తీసుకునే విషయాలు కావని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను ప్రశ్నించేలా ట్రంప్ చెబుతున్న మాటలు స్పష్టతను కోరుతున్నాయని వెల్లడిస్తోంది.
జనసామాన్యానికి తెలియాలి – కాంగ్రెస్ వాదన
ఈ వ్యాఖ్యలు నిజమైతే, దేశ ప్రజలకు విషయం స్పష్టంగా తెలియాలి. అవి అబద్ధమైతే, మోదీ ప్రభుత్వం తెగధెమ్మగా కొట్టిపారేయాలి. కానీ మౌనమే కొనసాగుతుండటంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.భారత్–పాక్ సంబంధాల వంటి కీలక అంశంపై పార్లమెంట్ వేదికపై స్పష్టత ఇవ్వడం అవసరం. కేంద్ర ప్రభుత్వం మౌనం వహించకుండా పార్లమెంట్‌లోనూ, ప్రజల ముందూ స్పష్టమైన జవాబు ఇవ్వాలని కాంగ్రెస్ కోరుతోంది.
Read Also : Syria : సిరియా సైనిక ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి