ఒడిశాకు ప్రధాని మోదీ Modi భారీ కానుక – గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ ఆరంభం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (సెప్టెంబర్ 27) ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా హాజరయ్యారు. టెలికమ్యూనికేషన్, రైల్వేలు, ఆరోగ్య సంరక్షణ, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి విభాగాల్లో పలు కీలక ప్రాజెక్టులు ప్రారంభం అయ్యాయి. టెలికమ్యూనికేషన్ రంగంలో దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో 97,500 పైగా 4G మొబైల్ టవర్లు ఏర్పాటు చేశారు. వీటిలో BSNL ఏర్పాటు చేసిన 92,600 టవర్లు, అలాగే డిజిటల్ ఇండియా ఫండ్ కింద నిర్మించిన 18,900 టవర్లు ఉన్నాయి. ఈ టవర్లు సుమారు 26,700 గ్రామాలను కలుపుతూ, రెండు మిలియన్లకు పైగా కొత్త వినియోగదారులకు సౌరశక్తి ఆధారిత సేవలను అందిస్తాయి. దీని వల్ల ఈ కాంప్లెక్స్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ హబ్‌గా నిలుస్తుంది.
ijay: సీఎం స్టాలిన్‌పై నటుడు విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు

Modi
అమృత్ భారత్
అదే విధంగా, మోదీ Modi పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, మరికొన్నింటిని జాతికి అంకితం చేశారు. సంబల్పూర్-సరళ రైలు ఫ్లైఓవర్, కోరాపుట్-బైగూడ లైన్ డబ్లింగ్, మనబార్-కోరాపుట్-గోర్పూర్ లైన్ విస్తరణ వంటి ప్రాజెక్టులు కనెక్టివిటీని పెంచుతాయి. ఈ ప్రాజెక్టులు ఒడిశాతో పాటు పొరుగు రాష్ట్రాల మధ్య రవాణా, పరిశ్రమలు, వాణిజ్యానికి ఊతమిస్తాయి.అలాగే, బెర్హంపూర్–ఉధ్నా (సూరత్) మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేసి, పర్యాటకానికి తోడ్పడుతుంది. ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
ఆరోగ్యరంగంలో భాగంగా బెర్హంపూర్‌లోని MKCG మెడికల్ కాలేజీ, సంబల్పూర్‌లోని VIMSAR లను ప్రపంచ స్థాయి సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు ఒడిశా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించనున్నాయి.
ప్రధాని మోదీ ఒడిశాలో ఎంత విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు?
రూ. 60,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్ ఎక్కడ ప్రారంభమైంది?
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో ప్రారంభమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: