ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే జీ7 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరుకానున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత కెనడాలో అడుగుపెట్టబోతున్నారు. ఈ పర్యటన కేవలం ఒక అంతర్జాతీయ కార్యక్రమం కాదని, దాని వెనుక చాలా రాజకీయ అర్ధాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పటికీ, ఇరుదేశాల మధ్య సంబంధాలు గతంలో మంటలేక్కాయి. ఖలిస్తానీ వాదిని హత్య చేసిన అంశంపై ట్రూడో ఆరోపణలు, భారత్‌కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు భారీ దౌత్య విమర్శలకు దారితీశాయి. వాణిజ్య చర్చలు ఆగిపోయాయి, అధికారులు బహిష్కరించబడ్డారు.కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ (Governor Mark Carney) ఇటీవల మోదీకి ఫోన్ చేసి సదస్సుకు ఆహ్వానించారు. ఇది సంబంధాలు పునరుద్ధరానికి ఓ ప్రయత్నంగా మారింది. కానీ ఇదే సమయంలో కెనడాలో విమర్శలు మోదీ పిలుపుపై మోగుతున్నాయి. కెనడా అవసరాలు, భారత్ ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని ఆ ఆహ్వానం వచ్చిందని ట్రూడో సమర్థించుకోవాల్సి వచ్చింది.
ఒక వారం ముందు పిలవడం వెనక కోపమేనా?
ప్రత్యేక ఆహ్వానితులకు ముందే పిలుపులు పంపిన కెనడా, భారత్‌ను మాత్రం చివరి నిమిషంలో పిలవడం గమనార్హం. ఇది రాజకీయ ప్రతీకారమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా భారత్ వెళ్ళకపోతే అవమానపడినట్టవుతుందన్న ఆలోచనతో పాల్గొనాలని నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.పదకొండేళ్ల పాలన తర్వాత మోదీ ఈ సదస్సులో పాల్గొనడం విశేషం. ఉగ్రవాదంపై పోరాటం, ఆపరేషన్ సిందూర్, పాక్ మద్దతు ఉగ్రవాదుల గురించి జీ7 నేతలకు వివరించే అవకాశం మోదీకి లభించనుంది. అమెరికా అధ్యక్షుడితో కూడా ప్రత్యక్షంగా చర్చించే వీలుంటుంది.
ఖలిస్తాన్ శక్తులకు సిగ్నల్ – మోదీకి ఆహ్వానం
మోదీకి ఆహ్వానం పలకడం ఖలిస్తానీ వేర్పాటువాదులకు ఒక ఎదురుదెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు. కెనడా ప్రధాని ఈసారి వాస్తవాలను గుర్తించి ముందడుగు వేసినట్టు కనిపిస్తోంది.కెనడా భారత్‌కు సహజవాయువు, అణుశక్తి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావచ్చు. ఖలిస్తానీ శక్తులకు కెనడా ఆశ్రయం ఇవ్వకుండా, భారత్‌కి పూర్తి మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు మళ్లీ ఊపు తెచ్చే అవకాశమున్నది.
Read Also : London Airport : డిపోర్టు చేస్తుండగా తప్పించుకున్న భారతీయుడు