దీపావళి సందర్భంగా బహుమతులు ఇవ్వడం ప్రతి సంస్థలోనూ సాధారణమే, కానీ హర్యానాలోని పంచకులలో ఉన్న MITS హెల్త్‌కేర్(MITS Health Care) ప్రైవేట్ లిమిటెడ్ మాత్రం ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చింది. సంస్థ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె. భాటియా ఈ సంవత్సరం 51 మంది ఎంపిక చేసిన ఉద్యోగులకు కొత్త కార్లను బహుమతిగా అందించారు.
Read also: Case of Fake liquor : 7 రోజుల పోలీస్ కస్టడీ!

ఇది భాటియా వరుసగా మూడవ సంవత్సరం కార్లను బహుమతిగా ఇస్తున్న సందర్భం. 2023లో 12 మంది ఉద్యోగులకు, 2024లో 15 మందికి కార్లను అందించిన ఆయన, ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 51 మందిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తమ కొత్త కార్ల తాళాలు స్వీకరించగా, వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది.
ఎం.కె. భాటియా విజయకథ
ఎం.కె. భాటియా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతానికి చెందినవారు. ఒకప్పుడు చిన్న మెడికల్ షాపు నడిపిన ఆయన, వ్యాపార నష్టాల కారణంగా దివాలా పరిస్థితికి చేరుకున్నారు. కానీ ఆయన వెనుకడుగు వేయలేదు — చండీగఢ్‌కు వెళ్లి అక్కడే ఫార్మాస్యూటికల్ వ్యాపారం ప్రారంభించారు. క్రమంగా కృషి, అంకితభావంతో ఎదుగుతూ ప్రస్తుతం 12 సంస్థలను విజయవంతంగా నడుపుతున్నారు. తన ఉద్యోగుల కృషిని గుర్తించి, వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్లను బహుమతిగా ఇవ్వడం ప్రారంభించారని ఆయన తెలిపారు. బైక్ లేదా ఆటోలో తిరిగే ఉద్యోగులు కారు కొనుగోలు చేయగలగాలని తన కల అని చెప్పారు.
కంపెనీ గురించి వివరాలు
MITS హెల్త్‌కేర్(MITS Health Care) ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఔషధ కంపెనీలలో ఒకటి. సంస్థ 25 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి మరియు, క్రిటికల్ కేర్, గైనకాలజీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్, కార్డియో-డయాబెటిక్(Diabetes) వంటి విభాగాల్లో మందులను తయారు చేస్తుంది. టాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్లు వంటి వేలాది ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ లక్ష్యం — నాణ్యమైన ఔషధాలను అందరికీ అందుబాటులోకి తేవడం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/