हिन्दी | Epaper

MGNREGA: ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు

Tejaswini Y
MGNREGA: ఉపాధి హామీ పథకానికి సాంకేతిక ఆటంకాలు

MGNREGA: అధునాతన సాఫ్ట్వేర్ అమలు, కొత్త సాంకేతిక నిబంధనలతో ఉపాధిహామి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సాంకేతిక విధానం క్షేత్రస్థాయిలో కూలీల పాలిట శాపంగా మారింది. దీంతో పలు జిల్లాల్లో కూలీలకు ఉపాధి పని కరువవుతోంది. కూలీలు ఉదయం, సాయంత్రం పనులకు హాజరుకావాలని, రెండుపూటలా ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలనే నిబంధనలతో ఇటు కూలీలు, అటు ఉపాధిహామీ సిబ్బంది పలు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు.

Read Also: Israel Iran War: 50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

MGNREGA: Technical hurdles to employment guarantee scheme
MGNREGA: Technical hurdles to employment guarantee scheme

ఒక పని పూర్తైన తర్వాతనే మరో పనిని చేపట్టాలనే మార్గదర్శకాలతో ఉపాధి పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిత్యం చేపడుతున్న పనులను ఎప్పటికప్పుడు యాప్లో పొందు పర్చాలని కేంద్రం ఆదేశించింది. దీంతో క్షేత్రస్థాయిలో సిగ్నల్స్ సరిగా లేక ఫొటోలు అప్లోడ్ కాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతు న్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమ ల్లోకి వచ్చిన ఐరిస్ అటెండెన్స్ ప్రక్రియ ఆదిలోనే హంస పాదులా తయారైంది. ఉపాధి పనులకు వెళ్లిన కూలీలు ఐరిస్ నమోదు కాకపోవడంతో మండు టెండలో గంటల తరబడి నిరీక్షించి, చివరకు పని చేయకుండానే నిరాశతో వెను దిరుగుతున్నారు.

నాలుగు గంటల తర్వాత గ్రూప్ ఫొటో

ఉపాధి హామీ నిబంధనల ప్రకారం పని ప్రారంభించే ముందు వ్యక్తిగత ఐరిస్ ఫొటో, పని ముగిసిన నాలుగు గంటల తర్వాత గ్రూప్ ఫొటో తీసి అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఉదయం 7 గంటలకే పని ప్రదేశానికి చేరుకున్న కూలీలకు సాంకేతిక లోపాలు చుక్కలు చూపిస్తు న్నాయి. మొబైల్ ఫోన్లలో ఐరిస్ స్కాన్ చేస్తున్నప్పుడు పదేపదే కాప్చర్ వర్కర్ ఫోటో అగైన్ అని ఎర్రర్ మెసేజ్ వస్తుండటంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో కనీసం అధికారులు టెంటు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని మండల అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా కేవలం ఐరిస్ సమస్యే కాకుండా, కేవైసీ అప్డేట్ కాలేదనే కారణంతో మరికొంతమంది పేర్లు మస్టర్లలో కనిపించడం లేదు. గతంలో పని చేసినా, ప్రస్తుతం పేర్లు నమోదు కాకపోవడంతో కూలీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫోటో కోసం గంటల సమయం పడుతుంటే పని ఎప్పుడు చేయాలి? ఒక రోజు కూలీ రాకపోతే మా బతుకులు ఎలా గడవాలి? అని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపి కూలీలకు ఉపాధి దూరం చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి సర్వర్ సమస్యలను పరిష్కరిం చాలని, లేదా సాఫ్ట్వేర్ పని చేయనిచోట మాన్యువల్ హాజరుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870