
Mumbai Wankhede Stadium: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీ(Messi) భారత్ పర్యటన సందర్భంగా అనూహ్య వివాదం చెలరేగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ మెస్సీతో తీసుకున్న సెల్ఫీల వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె ప్రవర్తన మర్యాదకు విరుద్ధంగా ఉందంటూ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Read also: Lionel Messi: ఒకే ఫ్రేమ్‌లో మెస్సీ, సచిన్
ఏం జరిగిందంటే…
మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా మెస్సీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ మహాదేవ’ అనే ఫుట్‌బాల్ అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు సచిన్ టెండూల్కర్, భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో అమృత ఫడ్నవిస్ వ్యవహారం వివాదానికి కారణమైంది. ఆమె పలుమార్లు మెస్సీతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం, చూయింగ్ గమ్ నములుతూ ఫోటోలకు పోజులివ్వడం వీడియోలో కనిపించింది. అంతేకాకుండా, మెస్సీ పక్కన నిలబడేందుకు ఫుట్‌బాలర్ రోడ్రిగో డి పాల్‌ను పక్కకు జరగమని కోరినట్లు కూడా నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో మెస్సీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక లెజెండరీ ఆటగాడి పట్ల ఇలాంటి ప్రవర్తన సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు.
తర్వాత అమృత ఫడ్నవిస్ మెస్సీతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడంతో, అక్కడ కూడా విమర్శాత్మక వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఇప్పటికే కోల్‌కతాలో మెస్సీ పర్యటనకు నిర్వహణ సమస్యలు తలెత్తగా, హైదరాబాద్‌లో మాత్రం ఏర్పాట్లకు ప్రశంసలు దక్కాయి. ముంబైలో జరిగిన ఈ ఘటనతో మెస్సీ భారత్ పర్యటన మరోసారి వార్తల్లో నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: