మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 మంది మావోయిస్టులు(Maoist surrender) భద్రతా బలగాల ముందు లొంగిపోవడంతో ఆ ప్రాంతంలో పరిస్థితులు మారుతున్నాయి. ముఖ్యంగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన, రూ.3 కోట్ల రివార్డు ఉన్న ప్రముఖ నాయకుడు రాంధెర్(Randher) లొంగుబాటు ప్రధాన సంఘటనగా నిలిచింది.
Read Also: Gold Silver Prices Today : బంగారం, వెండి ధరలు తగ్గాయి. డాలర్ బలహీనత…

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల సరెండర్ వరుస
దీర్ఘకాలంగా ఆయన ఎంఎంసీ (Maharashtra–Madhya Pradesh–Chhattisgarh) జోన్‌లో ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నారు. మిళింద్ తెల్టుంబే మరణం తర్వాత రాంధెర్ ఈ ప్రాంత నిర్వహణ, పార్టీ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. అలాంటి నేత లొంగిపోవడం భద్రతా వ్యవస్థకు కీలక విజయంగా అధికారులు భావిస్తున్నారు.
రాంధెర్ లొంగిపోవడంతో ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు నక్సల్స్ ప్రభావం నుండి దాదాపు పూర్తిగా బయటపడుతున్నాయని సమాచారం. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టులు (Maoist surrender) పెద్ద సంఖ్యలో లొంగిపోతుండటం కూడా మావోయిస్టు శక్తి క్రమంగా క్షీణిస్తోందనే సంకేతంగా భావిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: