ఆయుధాలో ఎప్పటికీ విజయం సాధించలేం. హింస ద్వారా దేన్ని కూడా సాధించలేం. ఒకవేళ ఏదైనా సాధించినా అది తాత్కాలికమే. అహింస వల్లే గొప్పవిజయాలను నమోదు చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీనికి మంచి ఉదాహరణ మహాత్మాగాంధీ. అహింసద్వారానే దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు. తుపాకులతో (guns) ఏమైనా చేయవచ్చనే మావోయిస్టుల అంచనాలు తలకిందులుగా అవుతున్నాయి.
Read Also: UN COP30: కాప్30 సదస్సులో అగ్ని ప్రమాదం..

నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన మావోయిస్టుల ఉద్యమం తీవ్ర ఒడిదొడుకులకు గురవుతోంది. వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోంది. పార్టీ నేతల్లో చాలామంది అగ్రనేతలే ఉద్యమాన్ని వీడుతున్నారు. ఇన్నాళ్లు మావోయిస్టుల్ని అక్కున చేర్చుకున్న దండకారణ్యంలో మనలేని పరిస్థితులు నెలకొనడంతో అగ్రనేతలు ఆయుధాలను వీడుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్న మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పార్టీకి ఎదురవుతున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగమించే అవకాశం లేదనని గ్రహించిన నేపథ్యంలోనే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అబూజ్ మడ్ గుండెకోట్ లో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ఎన్ కౌంటర్ లో మృతి చెందిన అనంతరం శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ప్రముఖుల మరణంతో పార్టీకీ భారీ దెబ్బ
ఈ ఒక్క ఏడాదిలోనే మావోయిస్టుల (Maoist) అగ్రనేతల మరణంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కేంద్ర కమిటి సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేశ్, కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, హిడ్మా మృతి చెందడం మావోయిస్టులకు పెద్ద దెబ్బె తగిలింది. మరికొందరు నేతలు లొంగిపోవడం కూడా ఓ కారణం. మావోయిస్టు సుప్రీం గణపతి ఆచూకీపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఎక్కడున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనే నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం గణపతి అబూజ్ మడ్ లోనే ఉన్నట్లు నిఘావర్గాలు అంటున్నాయి. ఆపరేషన్ కగర్ ప్రారంభానికి కొద్దిరోజుల ముందే ఆయన ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: