మొంథా తుఫాను తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విమాన రవాణాపై ప్రభావం చూపింది. విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాలకు నేడు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థల ఫ్లైట్లు నిలిపివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపారు.
Breaking News – Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన
విజయవాడ ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండిగో విమాన సర్వీసులు ఉదయం 10.45 వరకు మాత్రమే నడవనున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులు పరిమిత స్థాయిలో కొనసాగుతున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల ఆధారంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. రద్దయిన సర్వీసుల టికెట్లను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి.

అటు విశాఖకు ఢిల్లీ, భువనేశ్వర్, రాయ్పూర్, హైదరాబాద్, బెంగళూరు నగరాల నుంచి వచ్చే విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. తుఫాను ఉధృతిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు కొనసాగుతున్నాయి. తుఫాను మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో రవాణా వ్యవస్థపై ఇంకా ప్రభావం చూపవచ్చని అంచనా.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/