జమ్ము కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది పాకిస్థాన్ డ్రోన్లతో సైనిక స్థావరాలపై దాడులు చేసింది.ఈ ఘటనలపై స్పందించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, భారత బలగాలు ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.యూరి సెక్టార్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ పరిశీలన చేశారు. అక్కడ భద్రతా బలగాలతో సమావేశమయ్యారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు.”పాక్ దాడులు చేసినా, మన బలగాలు బలమైన ప్రత్యుత్తరం ఇవ్వగలవు” అని ధైర్యం నూరిపోశారు.సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడినట్లు ఎల్జీ తెలిపారు.గాయపడిన వారికి చికిత్స అందించామని చెప్పారు.ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా సాయం అందించినట్లు వెల్లడించారు.ప్రభుత్వం బాధితులను వదిలిపెట్టదని హామీ ఇచ్చారు.పలుచోట్ల గాలి దాడుల వల్ల గ్రామాలకు నష్టం జరిగింది. దీనిపై స్పందించిన సిన్హా, కొత్త బంకర్ల నిర్మాణం తప్పనిసరిగా అవసరమన్నారు.త్వరలోనే ఈ ప్రాంతాల్లో బంకర్లు నిర్మిస్తామని స్పష్టంచేశారు.ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.యూరిలో ఉన్న సైనికులతో ఎల్జీ సరదాగా సంభాషించారు. “హౌ ఈజ్ ది జోష్?” అని అడగడంతో సైనికుల స్పందనతో అక్కడ ఉత్సాహం నెలకొంది.ఈ ఒక్క మాటే బలగాల్లో నమ్మకం నింపింది.సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనలో ఉన్నా, ప్రభుత్వం వారి పక్కనే నిలుస్తుంది.వారి భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైనంత వరకు కేంద్రం మద్దతు అందిస్తుందని తెలిపారు.
Read Also : OperationSindoor :పాకిస్తాన్ కాల్పులు, సరిహద్దుల్లో భారతీయుల పరిస్థితి ఎలా ఉంది?