మహారాష్ట్ర (Maharashtra) లో విషాద ఘటన చోటుచేసుకుంది. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన 24 ఏళ్ల ఆశా సంతోష్ కిరంగ.. నిండు గర్భిణి. మారుమూల ప్రాంతం కావడంతో సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. దీంతో ఆమె ప్రసవం కోసం పెథాలోని తన సోదరి ఇంటికి బయలుదేరింది. అటవీ మార్గం గుండా భర్తతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి సోదరి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో కిరంగకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.
Read also: Drinking Water: కలుషిత నీరు తాగి 15 మంది మృతి..ఎక్కడంటే?

రవాణా సదుపాయం లేకపోవడం వల్లే
అప్పటికే తీవ్ర రక్తస్రావమవడంతో కడుపులోనే శిశివు మరణించింది. రక్తపోటు పెరగడంతో మహిళ కూడా కొద్దిసేపటికే మరణించింది. కిరంగను కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ షిండే పేర్కొన్నారు. వైద్య సదుపాయంతో పాటు రవాణా సదుపాయం లేకపోవడం వల్లే కిరంగ మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, కిరంగ మృతిపై విచారణ జరిపిస్తామని అధికారులు పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: