పిల్లలు క్రమశిక్షణతో ఎదగాలని ప్రతి టీచర్ (Teacher) కోరుకుంటుంది. చక్కగా చదవాలని, నీట్ గా కనిపించాలని, సమయానికి స్కూలు రావాలని, హోంవర్కు (homework) తప్పనిసరిగా చేయాలని విద్యాబోధతో పాటు నైతిక విలువల్ని కూడా బోధిస్తారు ఉపాధ్యాయులు.విద్యార్థులు మాట వినడకపోతే ఉపాధ్యాయులు శిక్ష కూడా విధిస్తారు. ఆ శిక్ష వారి క్షేమం కోరేదిలా ఉండాలి తప్ప ప్రాణం తీసేంతగా శిక్ష ఉండకూడదు. పిల్లలు విద్యార్థులే కానీ వారు నేరస్తులు కారనే స్పృహ ఉపాధ్యాయుల్లో ఖచ్చితంగా ఉండాలి.అయితే ఓ టీచర్ విద్యార్థికి ఇచ్చిన శిక్ష ఆమె ప్రాణాలను తీసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: AP Liquor Scam: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు

వీపుపై బ్యాగ్ పెట్టి గుంజీలు తీయించిందని బాలిక తల్లి ఫిర్యాదు
మహారాష్ట్ర (Maharashtra) పాల్హర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఈనెల 8న జరిగిన ఘటన ఇది. ఆలస్యంగా స్కూల్ కు వచ్చినందుకు బలవంతంగా వంద గుంజీలు తీయమని ఉపాధ్యాయురాలు చెప్పింది. దీంతో బాలిక గుంజీలు తీస్తూ అస్వస్థతకు గురై, ప్రాణాలు కోల్పోయింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు.
అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థిని బలవంతంగా గుంజీలు తీయించింది టీచర్. స్కూల్ కు లేట్ గా వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాలికకు ఈవిధంగా శిక్షను విధించింది. బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. వీపుపై బ్యాగ్ పెట్టి గుంజీలు తీయించిందని బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో టీచర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: