చదువు ఒత్తిడి భరించలేక ఘోరనిర్ణయం నేటి పిల్లలు, యువత చాలా సున్నితంగా మారుతున్నారు. చిన్న విషయాలకే ప్రాణాలను తీసుకుంటున్నారు. అడిగిన సెల్ ఫోన్కొనివ్వలేదని..ఇష్టమైన బైక్ కొనే కోరిక తీరలేదని, పరీక్షలు సరిగ్గా రాయలేదని ఇలా ప్రతి చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం కూడా తప్పనిసరిగా ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఈ లోకంలో ఏదీ లేదు. జీవితం అమూల్యమైనది. అందమైనది కూడా. చనిపోవడం పిరికితనం. పోరాడుతూ జీవించడమే అసలైన జీవితం. అయితే ఏం కష్టమెచ్చిందో ఏమో ఓ టీనేజ్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
Read Also: The Girlfriend: ‘చున్నీ తీసేస్తే ఎంపవర్మెంటా?’ నెటిజన్స్ ఆగ్రహం

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు
19వ అంతస్తు నుంచి దూకిన బాలిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్ర లోని కల్యాణ్ పట్టణంలో ఓ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలిక 19వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతురాలి పేరు రిద్ది ఖరాడే (14). స్థానిక పాఠశాలలో బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన సెమిస్టర్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల రిద్ది తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
గతకొన్ని రోజులుగా చదువు విషయంలో ఆందోళన రిద్ది గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటూ, చదువు విషయంలో ఆందోళన వ్యక్తం చేసేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాక చదువు విషయంలో ఆందోళన వ్యక్తం చేసిందని కూడా చెప్పారు. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం వల్ల తల్లిదండ్రులను నిరాశపరిచానన్న భావంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తన పెద్ద అక్కతో కలిసి ఇంట్లో ఉండగా, ఒక్కసారిగా 19వ అంతస్తు టెర్రస్ వైపు వెళ్లి దూకేసింది. తన కళ్లముందే ఘటన జరగడంతో అక్క షాక్ కు గురయ్యింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: