మహారాష్ట్ర (Maharashtra) లోని సతారా జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఓ ఆటో డ్రైవర్ (Auto driver) అమానుషంగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ తనిఖీల సమయంలో జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా ముందుకు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్‌ను ఈడ్చుకుంటూ వెళ్ళడం ఆందోళన కలిగించే ఘటనగా మారింది.
ట్రాఫిక్ తనిఖీల సమయంలో ఘటన
సోమవారం సతారా నగరంలోని ఒక ప్రధాన కూడలిలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆటో రిక్షా అక్కడికి రాగానే మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ (Lady Constable Bhagyashree Jadhav) ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలే, మద్యం మత్తులో ఉండటంతో ఆదేశాలను పట్టించుకోకుండా ఆటోను నడిపేశాడు.
మహిళా కానిస్టేబుల్ ప్రాణాపాయం
భాగ్యశ్రీ జాదవ్ ఆటోను ఆపేందుకు ముందుకు వెళ్ళిన వేళ, డ్రైవర్ ఆమెను పక్కకు జరగనివ్వకుండా ఈడ్చుకుంటూ కొద్దిదూరం లాగాడు. ఆ దృశ్యం చూసిన స్థానికులు ఆగ్రహించి వెంటనే స్పందించారు.
స్థానికుల ప్రతిస్పందన
ప్రజలు ఆటోను వెంబడించి కొద్దిదూరంలో ఆపేశారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాదారు. తర్వాత అతన్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలేను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: