మహారాష్ట్ర (Maharashtra) డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అంతిమ సంస్కారాలు స్వస్థలమైన బారామతిలో గురువారం ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్రకు ముందు, ఆయన పార్థివ దేహాన్ని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.
Read Also: Ajit Pawar: 5 సార్లు పేలుళ్ల శబ్ధాలు..ప్రత్యక్ష సాక్షి
ప్రముఖులు నివాళులు
కాగా, అజిత్ పవార్ అంతిమ సంస్కారాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో పాటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా హాజరై నివాళులర్పించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,

డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే బారామతి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: