ఒకదానికి ఆకలి..మరొకదానికి ప్రాణసంకటం. కడుపు నింపుకునేందుకు ఒక జీవి పోరాటం. ప్రాణాలను కాపాడుకోవాలనే తపన మరొక జీవి పోరాటం. రెండు జంతువులదీ పోరాటమే. కడుపు నిండాలంటే ఒక జీవి మరణించాలి.. లేదంటే తప్పించుకుని పాణాలను దక్కించుకోవాలి.. ఇంకాచెప్పాలంటే ఎదురాడి పోరాడాలి. ఓ కుక్క సరిగ్గా ఇదే చేసింది. అడవిలో అత్యంత క్రూర
జంతువు సింహం, పులులు, చిరుతలు. మాంసాహారి అయిన ఈ జంతువులు కనిపించిన ఏ ప్రాణిని వదలిపెట్టవు. అలాంటి చిరుత (Leopard) ఓ కుక్కను తినేద్దామని అనుకుంది. పాపం దాని కోరిక తీరలేదు. ఆ కథ ఏమిటో మీరే చదివేయండి..
Read also: America: లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖేడ్ తాలూకా పరిధిలో చోటు చేసుకుంది. చిరుత కుక్క మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరితమైన ఘర్షణ అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వీడియోలో చిరుత కుక్కకు తెలియకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ దగ్గరికి చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చిరుత ముందుకు కదలగానే, కుక్క ఆకస్మాత్తుగా ఎదురు దాడికి దిగింది. తగ్గేదే లే..పోరాడిన కుక్క కుక్క వెనక్కి తగ్గకుండా ధైర్యంగా తలపడడంతో చిరుత వెనుతిరగాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా కనిపించే ఒక కుక్క ఇంతటి సాహసాన్ని ఎలా ప్రదర్శించగలిగిందని
వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోవడం కంటే దాన్ని ఎదుర్కోవడమే. కుక్క ఎంచుకుంది. అదే నిర్ణయం చివరకు దాని ప్రాణాలను కాపాడిందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పైగా కుక్క చిరుతను వెంబడించేందుకు ప్రయత్నించడం కొసవెరుపు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: