ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) చిత్రం తెలుగుతో పాటుగా తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 2D, 3D ఫార్మాట్స్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు (Madras High Court) ఉత్తర్వులు ఇచ్చింది.
Read Also: The Family Man 3: అత్యధిక మంది వీక్షించిన సిరీస్‌గా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’

సమస్య పరిష్కారం అయ్యే వరకు
‘అఖండ – 2’ (Akhanda 2) నిర్మాణ సంస్థ 14 రీల్స్ (ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ (Eros International Company) కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2′ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: