ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక మహిళ భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. బహ్రైచ్ జిల్లాకు చెందిన ఓ యువతి ఉద్యోగ అవసరాల కోసం లక్నోలోని దుబగ్గా ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తోంది. సాధారణంగా కనిపించే ఈ అద్దె ఇల్లు ఓ ఆత్మగౌరవ మహిళ జీవితాన్ని క్షణాల్లో భయభ్రాంతులకు గురిచేసింది.

బాత్రూంలో రహస్య కెమెరా – మానవత్వాన్ని మరిచిన యజమాని
వివరాల్లోకి వెళితే, బహ్రైచ్‌కు చెందిన ఓ యువతి లక్నోలో అద్దె ఇంట్లో (rented house in Lucknow) నివసిస్తోంది. ఈ నెల జూన్ 24న తన బాత్రూంలో ఓ రహస్య కెమెరా ఉండటాన్ని ఆమె గమనించి షాక్‌కు గురైంది. దాన్ని పరిశీలించగా, వైఫైకి కనెక్ట్ చేసి ఉందని గుర్తించింది. వెంటనే ఆ కెమెరాను తొలగించగా, ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు.
బహిరంగం చేస్తానన్న బాధితురాలిపై అత్యాచార యత్నం
ముందుగా తన తప్పును ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. అయితే, పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేస్తానని బాధితురాలు హెచ్చరించడంతో అతడిలోని మృగం బయటపడింది. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని, ఈ విషయం బయటకు చెబితే ఆమె తల్లిని చంపేస్తానని, సోదరిపై అత్యాచారం చేస్తానని తీవ్రంగా బెదిరించినట్టు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలి ధైర్యం – పోలీసులకు ఫిర్యాదు
బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి దుబగ్గా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దుబగ్గా పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ అభినవ్ వర్మ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Special trains: తిరుపతి, కాచిగూడ రూట్లలో 48 ప్రత్యేక రైళ్లు