భారతదేశం(India) గ్యాస్ అవసరాలను తీర్చేందుకు అమెరికాతో మరో కీలక ఒప్పందం(LPG Deal) కుదిరిందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్‌సింగ్ పూరి వెల్లడించారు. ఈ ఒప్పందం ప్రకారం, రాబోయే ఒక సంవత్సరం కాలం పాటు భారత కంపెనీలు అమెరికా నుంచి భారీ స్థాయిలో LPGని దిగుమతి చేసుకోనున్నాయి. మొత్తం 2.2 MTPA (మిలియన్ టన్నులు పర్ అనం) వరకు దిగుమతి చేసుకోవడానికి భారత్ ఒప్పుకుంది.
Read also: Narayana Murthy: దేశాభివృద్ధికి 72 గంటలు చాలు: మూర్తి

ఇది దేశం వార్షికంగా దిగుమతి చేసుకునే మొత్తం LPGలో దాదాపు 10% భాగం అన్నమాట. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మారుతున్న సమయంలో, ఈ ఒప్పందం భారత LPG సరఫరాలో స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, వినియోగదారులకు తక్కువ ధరలో గ్యాస్ అందేలా చేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు తక్కువ ధరలో LPG – ప్రభుత్వ లక్ష్యం
మంత్రి హర్దీప్‌సింగ్ పూరి మాట్లాడుతూ, అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగినా, ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుంటోందని అన్నారు. మార్కెట్ రేటు ప్రకారం ఒక LPG సిలిండర్ ధర ₹1100 వరకు ఉండాల్సి ఉన్నా, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, సప్లై ఒప్పందాల కారణంగా సాధారణ వినియోగదారులకు అది ₹500–₹550 మధ్యకే లభిస్తోందని తెలిపారు. ఈ అమెరికా ఒప్పందం(LPG Deal) వల్ల LPG సరఫరా నిరంతరం కొనసాగడమే కాకుండా, ధరలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉందని కేంద్రం ఆశిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో LPG వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, సరసమైన ధరలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
భవిష్యత్‌లో మరిన్ని ఇంధన ఒప్పందాలకు మార్గం
ఇంధన భద్రత విషయంలో భారత్ తీసుకుంటున్న ప్రో-యాక్టివ్ అడుగులలో ఇది ఒకటని అధికారులు చెబుతున్నారు. గ్లోబల్ మార్కెట్‌లో కలుగుతున్న అనిశ్చితి, రవాణా ఖర్చులు, డిమాండ్ పెరుగుదల, ఇవన్నీ పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ఫ్యూయల్-సప్లై ఒప్పందాలు కీలకం అవుతున్నాయి. ఈ డీల్‌తో భారత్ అంతర్జాతీయ ఇంధన వ్యవస్థలో మరింత బలమైన విజిబిలిటీ సాధించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ ఎంత LPG దిగుమతి చేసుకోనుంది?
సుమారు 2.2 MTPA LPGను అమెరికా నుంచి దిగుమతి చేసుకోనుంది.
ఈ ఒప్పందం ఎంతకాలం ఉంటుంది?
ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: