ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో హద్దులు దాటుతున్నట్లుగా అనేక సందర్భాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ జంట(Lovers) ప్రైవసీ కోసం రైల్వే ట్రాక్‌పై ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద కూర్చుని ప్రేమలో మునిగిపోయింది. ప్రమాదకరమైన ప్రదేశాన్ని ఎంచుకున్న ఈ జంట చేసిన నిర్లక్ష్యం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో(Social media) వైరల్ అవుతుండగా, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read also: సవరణల తర్వాతే శాంతి ప్రణాళిక: జెలెన్ స్కీ

ప్రమాదాన్ని అంచనా వేయకుండా రైల్వే ట్రాక్‌పై రొమాన్స్
వీడియోలో(Lovers) కనిపించిన ప్రకారం, రైల్వే ట్రాక్‌పై నిలిచిన గూడ్స్ రైలు కింద ఓ యువకుడు, యువతి ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ కూర్చున్నారు. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని లెక్కచేయకుండా, తమలో తమే మునిగిపోయారు. పసుపు రంగు చీర ధరించిన యువతిని ఆమె ప్రియుడు ప్రేమగా కౌగిలించుకుంటూ ఉన్నాడు. ఇదే సమయంలో అనుకోకుండా ఆగి ఉన్న రైలు భారీ శబ్దంతో కదలడం ప్రారంభించింది. అశ్రద్ధగా రొమాన్స్‌లో మునిగిపోయిన ఆ జంట రైలు కదలికతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురై వెంటనే పక్కకు దూకారు. వారు ట్రాక్ నుంచి తొలగిన కొన్ని క్షణాల్లోనే రైలు ముందుకు కదిలింది. కేవలం ఒక క్షణం ఆలస్యమైనా ఈ ఘటన విషాదంగా మారేది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంత ప్రమాదకరమైన ప్రదేశంలో ఎందుకు రిస్క్ తీసుకుంటారు? “ప్రాణాల విలువ తెలీదా?” అంటూ మండిపడుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: