Last Land of India: భారతదేశం అనగానే విభిన్న సంస్కృతులు, చారిత్రక కట్టడాలు, పవిత్ర క్షేత్రాలు, ప్రకృతి సౌందర్యం కళ్లముందు నిలుస్తాయి. అలాంటి అనేక ప్రత్యేకతల మధ్య దక్షిణ భారతంలో రెండు సముద్రాల మధ్య ఒక సన్నని భూభాగంపై ఉన్న ఓ గ్రామం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. దేశంలోనే చివరి గ్రామంగా పేరొందిన ఈ ప్రాంతం, అరుదైన భౌగోళిక స్వరూపంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా సందర్శకులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
Read Also: Delhi Pollution:వాయు కాలుష్య ముప్పు: 18 ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి AQI


‘లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన ధనుష్కోడి, తమిళనాడులోని రామేశ్వరం దీవిలో ఉంది. ప్రముఖ శైవ క్షేత్రమైన రామేశ్వరానికి సుమారు 19 కిలోమీటర్ల దూరంలో, పంబన్ దీవుల సమీపంలో ఈ గ్రామం విస్తరించి ఉంది. భారతదేశం–శ్రీలంకను అనుసంధానించే రామసేతు (Adams Bridge) ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని భావిస్తారు. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ఈ ప్రదేశం ప్రకృతి అందాలతో కనువిందు చేస్తుంది. 2016 వరకు ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి సముద్ర మార్గమే ఆధారంగా ఉండేది. ఆ తర్వాత రోడ్డు నిర్మాణంతో పర్యాటకులకు సులభంగా చేరుకునే అవకాశం కలిగింది.

బంగాళాఖాతం–హిందూ మహాసముద్రం మధ్య అద్భుత గ్రామం
ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం మధ్య ఉన్న ధనుష్కోడి బీచ్ అందాలు మాటల్లో వర్ణించలేనివి. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ వాతావరణం అనుకూలంగా ఉండటంతో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. రామేశ్వరం ఆలయ దర్శనం అనంతరం చాలా మంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. రామేశ్వరం(Rameswaram) నుంచి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని రోడ్డు మార్గంలో సులభంగా చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి రామేశ్వరం చేరుకుని, అక్కడి నుంచి ధనుష్కోడి సందర్శించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :