రెండు క్రీడా బిల్లులకు లోక్‌సభ (Loksabha)ఓకే చెప్పింది. జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లులకు ఇవాళ లోక్‌సభ(Loksabha) ఆమోదం (Approval of bills)తెలిపింది. ఆ బిల్లులను క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. జాతీయ క్రీడా గవర్నెన్స్ బిల్లు, జాతీయ యాంటీ డోపింగ్ సవరణ బిల్లులపై క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడల్లో జరిగిన అతిపెద్ద సంస్కరణజాతీయ క్రీడా పరిపాలన బిల్లు అని మంత్రి తెలిపారు. క్రీడాకారులు వైభవోపేతంగా వెలిగిపోవాలన్న ఉద్దేశంతో క్రీడా గవర్నెన్స్ బిల్లును తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు. క్రీడా వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.

యాంటీ డోపింగ్ బిల్లు కూడా కొత్త చట్టమే అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డోపింగ్ విధానాలను ఇది సమర్థిస్తుందన్నారు. పారదర్శకంగా డోపింగ్ చర్యలు చేపట్టే విధంగా చూడనున్నట్లు చెప్పారు. ఒకవైపు బిల్లుపై చర్చ జరుగుతుంటే.. విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. బీహార్‌లో జరిగిన సిర్ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ బిల్లును పాస్ చేశారు. రెండు క్రీడా బిల్లులు పాసైన తర్వాత తాత్కాలిక చైర్ సంధ్యా రే లోక్‌సభ(Loksabha)ను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభ మొత్తం సభ్యులు?
భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభలో గరిష్టంగా 550 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం, దీనికి 543 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. ఈ సభ్యులను దేశవ్యాప్తంగా వివిధ పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.
భారతదేశంలో మొత్తం ఎంపీలు?
భారత రాజ్యాంగం సభలో గరిష్టంగా 550 మంది సభ్యులను అనుమతిస్తుంది, 530 మంది సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు మరియు 20 మంది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ప్రస్తుతం, లోక్‌సభలో ఎన్నికైన ప్రతినిధులచే భర్తీ చేయబడిన 543 సీట్లు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: