తెలంగాణలో మద్యం దుకాణాల(Liqour) లైసెన్స్‌ల దరఖాస్తు గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. లాటరీ ప్రక్రియను నిలిపివేయాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. అయితే, ఈనెల 19 నుంచి 23 మధ్య సమర్పించిన దరఖాస్తులు తుది తీర్పుపైనే ఆధారపడతాయని స్పష్టం చేసింది.
Read Also : Kishan Reddy: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు 46% పూర్తి: కేంద్రమంత్రి

మద్యం దుకాణాల(Liqour) దరఖాస్తుల స్వీకరణ గడువును అక్టోబర్ 18 నుంచి 23 వరకు పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ పలు దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, మద్యం అమ్మకాలపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని, 18న బీసీ సంఘాలు బంద్ నిర్వహించిన నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా గడువు పొడిగించామని తెలిపారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం మాత్రమేనని పేర్కొన్నారు.
ఇక పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్(Avinash Desai) మాట్లాడుతూ, గడువు పొడిగింపు 2012 ఎక్సైజ్ నిబంధనలకు వ్యతిరేకమని వాదించారు. దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు ఉన్న నేపథ్యంలో గడువు పెంపుతో దరఖాస్తులు పెరిగి, లాటరీలో అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం, గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణించాలా లేదా అనేది ప్రధాన అంశమని వ్యాఖ్యానించి, తీర్పును రిజర్వు చేసింది. అప్పటివరకు కొత్త దరఖాస్తుల కేటాయింపులు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని తెలిపింది.
పిటిషన్ ఏ అంశంపై దాఖలైంది?
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపుపై పలు దరఖాస్తుదారులు హైకోర్టును ఆశ్రయించారు.
గడువు ఎప్పుడు పొడిగించారు?
ఎక్సైజ్ శాఖ కమిషనర్ అక్టోబర్ 18 నుంచి 23 వరకు గడువు పెంచారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: