sadhu disguise arrest : ఉత్తరప్రదేశ్‌లో 1986లో జరిగిన యాసిడ్ దాడి కేసులో జీవితఖైదు విధించబడిన నిందితుడు, బెయిలుపై విడుదలైన తర్వాత 37 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అయితే, చివరకు మధ్యప్రదేశ్‌లో సాదువు వేషంలో దాగి ఉన్న చోట పోలీసులు అతడిని పట్టుకున్నారు.
షాజహాన్‌పూర్ ఎస్పీ రాజేష్ ద్వివేది వెల్లడించిన వివరాల ప్రకారం, రాజేష్ అలియాస్ రాజు అనే నిందితుడు మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా గాయత్రీ శక్తిపీఠం వద్ద సన్యాసిలా వేషం ధరించి నివసిస్తున్నాడు. ఆధునిక ఫింగర్‌ప్రింట్ సాంకేతికత (NAFIS పోర్టల్) సహాయంతో అతని గుర్తింపును పోలీసులు ధృవీకరించారు.
Read also: Actress Vahini: క్యాన్సర్ తో బాధపడుతున్న నటి వాహిని
1986 ఆగస్టులో జరిగిన ఘటనలో, నగల (sadhu disguise arrest) దుకాణానికి వెళ్తున్న ఇద్దరు వ్యక్తులపై రాజేష్ దాడి చేసి, వారి వద్ద ఉన్న యాసిడ్ బాటిల్‌ను లాగి వారి మీద పోశాడు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో IPC 326, 307 సెక్షన్ల కింద అతడిని అరెస్టు చేసి, 1988లో కోర్టు జీవితఖైదు విధించింది.
బెయిల్‌పై విడుదలైన తరువాత అతడు ఎప్పుడూ తిరిగి కోర్టుకు హాజరుకాలేదు. అనేక సంవత్సరాల పాటు వేర్వేరు ఆశ్రమాలు, మఠాలు మారుతూ ఉండడంతో పోలీసులు అతడిని గుర్తించలేకపోయారు. చివరకు మఠంలో సాదువుగా జీవిస్తున్న సమయంలో అతడు అరెస్టయ్యాడు.
ప్రస్తుతం రాజేష్‌ను న్యాయపరమైన కస్టడీలోకి తరలించినట్టు ఎస్పీ తెలిపారు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: