కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్(Congress) పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) పాలసీదారుల సేవింగ్స్‌ను అదానీ గ్రూప్ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించింది. సామాన్య ప్రజల జీవితకాల పొదుపులను ఒక ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చేలా దుర్వినియోగం చేశారంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2025 మేలో అదానీ గ్రూప్‌లో రూ.33 వేల కోట్ల LIC నిధులను పెట్టుబడి పెట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కొన్ని అంతర్గత పత్రాలు సూచిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Read also: మంట గలిసిన మానవత్వం .. మృతదేహ స్మశానంలో ఓ మహిళ

ఇతర ఆరోపణలు, డిమాండ్లు
గతేడాది సెప్టెంబర్‌లో గౌతమ్ అదానీ, అతని సహచరులు తమ కంపెనీ గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించినందుకు అమెరికాలో కేసు నమోదైందని జైరాం రమేష్ గుర్తు చేశారు. ఆ సమయంలో LIC నాలుగు గంటల ట్రేడింగ్‌లో రూ. 7,850 కోట్లు నష్టపోయిందని తెలిపారు. ప్రధానమంత్రి మోదీ ప్రజాధనాన్ని తన మిత్రులకు పంచిపెట్టడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆయన ఆరోపించారు.
దీంతో పాటు, అదానీ గ్రూప్ కోసమే ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు వంటి కీలక మౌలిక సదుపాయల ఆస్తులను కేంద్రం ప్రైవేటీకరణ చేసిందని కాంగ్రెస్ విమర్శించింది. విదేశాల్లో కూడా అదానీ గ్రూప్‌కు కాంట్రాక్టులు అప్పగించేందుకు దౌత్య వనరులు దుర్వినియోగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, జైరాం రమేష్ చేసిన ఈ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం కానీ, అదానీ గ్రూప్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: