కార్యాలయ సంస్కృతి ఎలా మారుతోందో చూపించే ఓ సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఓ ఉద్యోగి పంపిన సెలవు(Leave Policy) అభ్యర్థన ఈమెయిల్‌ను మేనేజర్ లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగి చూపిన నిజాయతీ, మేనేజర్ ఇచ్చిన స్పందనకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: Face Authentication: ఆధార్ కొత్త నియమాలు తెలుసా

సెలవు కోసం స్పష్టమైన అభ్యర్థన
ఓ ఉద్యోగి తన మేనేజర్‌కు(Leave Policy) పంపిన ఈమెయిల్‌లో డిసెంబర్ 16న సెలవు కావాలని కోరాడు. కారణంగా, తన ప్రియురాలు 17న ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామానికి వెళ్లనున్న విషయం ప్రస్తావించాడు. ఆమె తిరిగి జనవరి మొదటి వారం వరకు రానందున, వెళ్లే ముందు ఒక రోజు పూర్తిగా ఆమెతో గడపాలని ఉందని నిజాయతీగా వివరించాడు. అందుకే సెలవు మంజూరు చేయాలని వినయంగా అభ్యర్థించాడు.
మేనేజర్ స్పందనకు ప్రశంసలు
ఈమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన మేనేజర్, తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. “పదేళ్ల క్రితం ఇలాంటి సందర్భాల్లో ‘ఆరోగ్యం బాగాలేదు’ అని చివరి నిమిషంలో మెసేజ్ పంపేవారు. కానీ ఇప్పుడు ముందే స్పష్టంగా, పారదర్శకంగా చెప్పడం చూస్తే కాలం ఎంతగా మారిందో అర్థమవుతుంది. ఈ విధానం నాకు నచ్చింది. ప్రేమకు కాదనలేం కదా?” అంటూ సెలవు మంజూరు చేసినట్టు తెలిపారు.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
ఈ పోస్ట్ లింక్డ్‌ఇన్‌లో వేల మందిని ఆకట్టుకుంది. చాలామంది ఉద్యోగి నిజాయతీని, మేనేజర్ సానుకూల దృక్పథాన్ని అభినందిస్తూ, ఇవి కార్యాలయంలో నమ్మకాన్ని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంచుతాయని వ్యాఖ్యానించారు. అయితే కొందరు మాత్రం వ్యక్తిగత సెలవులకు ఇంత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని, “పర్సనల్ లీవ్ కావాలి” అని అడిగితే సరిపోతుందని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: