వివాహ బంధం అంటే కేవలం ఒక ఆచారం, ఒక వేడుక మాత్రమే కాదు. అది జీవితాంతం ఇద్దరిని ఒకే గూటిలో కట్టిపడేసే బంధం. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, మానసిక ఆధారం, భావోద్వేగ సహకారం అన్నీ కలిసినపుడే ఆ బంధం బలంగా నిలుస్తుంది. తాజాగా భార్యాభర్తల బంధం, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి అంశాలపై విచారణ జరుగుతున్న ఒక కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.ఇద్దరు పిల్లలున్న ఒక జంట విడాకుల కోసం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించింది. భార్య తన వాదనలో.. “నేను నా భర్తపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలనుకుంటున్నాను” అని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలంటే పెళ్లే చేసుకోకూడదు” అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఎవరిపై ఆధార పడకుండా జీవించాలని
ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరు కూడా విద్యావంతులు, స్థిరపడినవారు. భర్త సింగపూర్‌లో పని చేస్తుండగా.. భార్య హైదరాబాద్ (Hyderabad) నుంచి విచారణలో వర్చువల్‌గా పాల్గొన్నారు. ముఖ్యంగా భార్య.. తన భర్తతో కలిసుండాలని లేదని చెప్పింది. గతంలో అతడితోపాటు సింగపూర్ వెళ్తే.. తమను సరిగ్గా చూసుకోలేదని వాపోయింది. డబ్బుల విషయంలో గొడవలు జరిగినట్లు వివరించింది. అందుకే తాను ఎవరిపై ఆధార పడకుండా జీవించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. కానీ న్యాయస్థానం మాత్రం.. విడాకులు తీసుకోకుండా ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలని కోర్టు దంపతులకు సూచించింది. “పిల్లలు విచ్ఛిన్నమైన కుటుంబాన్ని చూడకూడదు” అని న్యాయమూర్తులు తీవ్ర భావోద్వేగంతో పేర్కొన్నారు.విడాకుల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి.. రాజీ పడేందుకు ప్రయత్నించాలని చెప్పారు.

పిల్లల భవిష్యత్తు
భార్య, పిల్లల నిర్వహణ ఖర్చుల కోసం భర్త రూ. 5 లక్షలు జమ చేయాలని.. అలాగే వారాంతాల్లో పిల్లలను తన వద్దకు తీసుకెళ్లాలని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలో భర్త రాజీకి సిద్ధమని చెప్పగా.. భార్య మాత్రం విముఖత చూపినట్లు తెలుస్తోంది.ఈ మొత్తం వ్యవహారం వివాహ వ్యవస్థపై సుప్రీం కోర్టుకున్న సంప్రదాయ వైఖరిని మరోసారి బయటపెట్టింది. వివాహ బంధాన్ని కాపాడటం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే కోర్టు ప్రధాన లక్ష్యమని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది?
భారత సుప్రీంకోర్టు 1950, జనవరి 26న స్థాపించబడింది. అదే రోజు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఏమని పిలుస్తారు?
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని “చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా” (CJI) అని పిలుస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: