రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎలా మారిపోతారో తెలియదు. నేటి శత్రువులు రేపటి మిత్రులుగా మారిపోతారు. లేదా నేటి మిత్రులు రేపటి శత్రువులు మాత్రమే కాదు వారిని అరెస్టు
చేయించేంతలా ద్వేషిస్తారు. అందుకే రాజకీయాల్లో శాశ్విత మిత్రులు కానీ, శత్రువులు కాని ఉండరు. సొంత కుటుంబ సభ్యులే కుటుంబ విభేదాలతో, ఆస్తుల గొడవలతో బయటికి వచ్చి
వేరు కుంపటి పెట్టుకోవడం మన భారతీయ రాజకీయాల్లో (Indian politics) సర్వసాధారణమైన విషయంగా మారింది.
సొంతపార్టీలను వీడి వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. పోనీ ఇలా సొంతపార్టీల్లోనైనా వారు విజయాన్ని పొందుతున్నారా అంటే అదీ లేదు. అట్టర్ ప్లాప్ అవుతున్న సంఘటనలే చూస్తున్నాం. ఇప్పటివరకు కుటుంబాల్లో చిచ్చుతో బయటకు వచ్చి, సొంత పార్టీలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు.
హాట్ టాపిక్ గా మారిన కవిత సస్పెండ్
రెండురోజుల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా పేరొందిన కల్వకుంట్ల కవిత వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన విషయం విధితమే. హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీసింది.
దీంతో మంగళవారం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీలోని కీలక నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పేర్కొంది.
దీంతో కవిత జాగృతి పేరుతోనే కొత్తపార్టీ పెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండురోజుల్లో ఆమె తన పార్టీని ప్రకటించనున్నట్లు, ఈ పార్టీకి రిజిస్ట్రేషన్ కు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
కవిత సొంతంగా రాణించగలరా?
కల్వకుంట్ల కవితకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లే. కేసీఆర్ మొదట తెలుగుదేశం ఆ తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో టీఆర్ఎస్ పార్టీగా ఏర్పాటు చేసి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కీలకమైంది.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆయన రాష్ట్రంలో పలు ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ సమయంలోనే కవిత తండ్రికి ఆసరాగా నిలబడి, ఉద్యమంలో బతుకమ్మ పండుగను ప్రత్యేక ఆకర్షణంగా తీసుకొచ్చి, తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.
అనంతరం ఎంపీగా, ఎమ్మెల్సీగా రాజకీయాల్లో కొనసాగారు. జాగృతి పేరుతో సామాజిక సంస్థను ఏర్పాటు చేసి, తనవంతుగా పార్టీకి అండగా నిలిచారు. అయితే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మరి సొంతంగా పార్టీ పెట్టుకుని, ఎంతవరకు సక్సెస్ కాగలరో వేచిచూడాలి.

కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిళ పార్టీ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిళ గురించి తెలియని వారుండరు. రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం, వైఎస్జగన్, షర్మిళల మధ్య ఆస్తుల విభేదాలతో షర్మిళ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీని ఏర్పాటుచేశారు. తెలంగాణలో కొన్నిరోజులు పార్టీకార్యక్రమాలను నడిపిన ఆమె హఠాత్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమెఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నా, ఆశించిన విధంగా పార్టీలో రాణించలేకపోతున్నారు. ఆమె ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం లేదనే వాస్తవం అందరికీ తెలిసిందే.
అళగిరి తండ్రిపై తిరుగుబాటు.. సొంతపార్టీ
తమిళనాడులో ఓ వెలుగు వెలిగిన దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుల మధ్య రాజకీయ వారసత్వం విషయంలోవివాదం తలెత్తింది. కరుణానిధి బతికి ఉన్నసమయంలోనే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి తండ్రితో విభేదించి, బహిరంగవిమర్శలు చేయడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనంతరం కరుణానిధి తన రాజకీయ వారసుడిగా స్టాలిన్నుప్రకటించారు. అళగిరి రాజకీయ కనుమరుగు కాగా స్టాలిన్ తమిళనాడు సీఎంగా కొనసాగుతున్నారు.
మేనకాగాంధీఇందిరాగాంధీ కుమారుడు అయిన సంజీవ్ గాంధీ సతామణి మేనకాగాంధీ. 1982లో ఆమె ఇందిరాగాంధీతో విభేదించడం వల్ల పార్టీ ఆమెను బహిష్కరించింది. దీంతో ఆమె ఆ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, జనతాదళ్ పార్టీలో చేరి, ఎంపీగా గెలిచారు. ఆమె కుమారుడు వరుణ్గాంధీ కూడా కొంతకాలం రాజకీయాల్లో వచ్చి, అనంతరం కనుమరుగైపోయారు. మేనకాగాంధీ మాత్రం ప్రస్తుతం బీజేపీలోకొనసాగుతున్నారు.
నందమూరి హరికృష్ణ
ఎన్టీఆర్ కుమారుడిగా హరికృష్ణ గురించి తెలియని వారుండరు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కుటుంబ కలహాలుచోటుచేసుకున్నాయి. దీంతో హరికృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే హరికృష్ణ సొంతపార్టీని నెలకొల్పినా అది ఎక్కువ కాలంకొనసాగలేకపోయింది. చివరికి ఆయన తన పార్టీని టీడీపీలో విలీనం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: