Latest News : భువనేశ్వర్ ఒడిశా రాష్ట్రం బేరంపూర్‌కు చెందిన 22 ఏళ్ల యూట్యూబర్ సాగర్ కుందు డుడుమా జలపాతం వద్ద (Latest News) వీడియోలు షూట్ చేస్తుండగా కొట్టుకుపోయి ఐదు రోజులుగా కనిపించడం లేదు.
ఆగస్టు 23న సాగర్ తన స్నేహితులతో కలిసి 175 మీటర్ల ఎత్తైన డుడుమా జలపాతం వద్దకు వెళ్ళాడు. నీటి మట్టం పెరుగుతోందని స్నేహితులు హెచ్చరించినా, ఆయన జలపాతంలోకి వెళ్లాడని పోలీసులు తెలిపారు.
మచ్కుంద్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కావడంతో ఒక్కసారిగా ప్రవాహం పెరిగి, సాగర్ కుందు గట్టిగా కొట్టుకుపోయాడు. స్నేహితులు రక్షించేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సాగర్ తండ్రి స్థానిక అధికారులను తన కుమారుడి కోసం శోధించాలని కోరారు. ప్రస్తుతం ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF), అగ్నిమాపక సిబ్బంది శోధన కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు సాగర్ విసిరేసిన కెమెరా పరికరాలు, బ్యాగ్ మాత్రమే దొరికాయి.
అయితే వర్షాలు, పర్వత ప్రాంతం, రాళ్లతో కూడిన భూభాగం కారణంగా శోధనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు తెలిపారు. మచ్కుంద్ డ్యాం గేట్లు మూసేయమని డ్యాం అధికారులను కూడా అభ్యర్థించారు. నీటి మట్టం తగ్గితే శోధన సులభం అవుతుందని అగ్నిమాపక విభాగం తెలిపింది.
డుడుమా జలపాతం ఒడిశా–ఆంధ్ర సరిహద్దులోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.
Read also :