ప్రతిరోజూ గుండెపోటుతో మరణించే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ సమస్య ఎదురవడం సామాన్యంగా మారుతోంది. అనారోగ్యకరమైన ఆహారం, తక్కువ శారీరక వ్యాయామం, ఆందోళన, నిద్ర లోపం, మరియు రక్తపోటు, కోలెస్ట్రాల్ లాంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం కారణంగా హృదయ సంబంధ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యపై వైద్యులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు ఇస్తూనే ఉన్నారు. అయితే, చెన్నైలో సంచలనమైన ఘటన ఒక్కసారి గమనార్హంగా నిలిచింది.చెన్నైలోని సవితా మెడికల్ కాలేజీ లో గుండె సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ (Gradlin Roy) గుండెపోటుతో మరణించడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలు. ప్రతి రోజు అనేక మంది హృదయ రోగులను రక్షించడానికి కృషి చేసే డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్, స్వయంగా విధుల్లో ఉండగా, గుండెపోటుతో ప్రాణాలు కోల్పోడం అందరినీ షాక్ కు గురి చేసింది.
ప్రాణాలను కాపాడటానికి
ఆయన సహచరులు ఆయనను బతికించడానికి ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకపోయింది. ఈ షాకింగ్ వార్తను హైదరాబాద్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన X ఖాతాలో షేర్ చేశారు.డాక్టర్ రాయ్ ప్రాణాలను కాపాడటానికి ఆయన సహచరులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. CPR, అత్యవసర యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్, ఇంట్రా-అయోర్టిక్ బెలూన్ పంప్, ECMO కూడా ఉపయోగించబడ్డాయి. కానీ వారు ఆయనను కాపాడలేకపోయారు అని డాక్టర్ సుధీర్ పేర్కొన్నారు.ఇటీవలి కాలంలో 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఎక్కువగా గుండెపోటుతో బాధపడుతున్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. ఇతరుల హృదయాలను కాపాడటానికి, రోగుల ప్రాణాలను కాపాడటానికి కష్టపడి పనిచేసే వారు తమ స్వంత హృదయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

నిద్రకు ప్రాధాన్యత
నిద్ర లేకపోవడం, సక్రమంగా పని చేయకపోవడం, సక్రమంగా భోజనం చేయకపోవడం, ఆసుపత్రి క్యాంటీన్ ఆహారం తీసుకోవడం, కెఫిన్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి ఇవన్నీ గుండెపోటుకు ప్రధాన కారణాలు. అందువల్ల, ఇతరు ప్రాణాలను కాపాడటానికి కష్టపడి పనిచేసే వైద్యులు తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడానికి, శారీరక శ్రమలో పాల్గొనడానికి, ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యానం చేయడానికి, పోషకమైన ఆహారం తినడానికి, విరామం తీసుకోవడానికి, కుటుంబం, స్నేహితులతో సమయం గడపడానికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సుధీర్ సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: