దేశ వ్యాప్తంగా భారీ వర్షా(Heavy Rains) లు కురుస్తన్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రా(Northern States)ల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కూడా విధ్వంసం సృష్టించింది. అయితే హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో భారీ వర్షాలు కురవడంతో ప్రధాన మార్గాలు అన్ని కూడా మూత పడుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో వెయ్యికి పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

355 రోడ్లు మూతపడ్డాయి
రోడ్లు దెబ్బతినడంతో దాదాపుగా 15 పంచాయతీలకు సంబంధాలు తెగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బజౌరా చెక్ పోస్ట్ దగ్గర కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కసోల్-కులూ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో దాదాపుగా 355 రోడ్లు ఇప్పటి వరకు మూతపడ్డాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా దాదాపుగా 261 మంది మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
భారీ వర్షాల కారణంగా..
అధికారులు రెడ్ అలర్ట్ జారీ
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల కొన్ని జిల్లాలకు అక్కడ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేశారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏది?
హిమాచల్ ప్రదేశ్ కు రెండు రాజధానులు ఎందుకు ఉన్నాయి? సిమ్లా మరియు ధర్మశాల హిమాచల్ ప్రదేశ్ కు రెండు రాజధానులు. సిమ్లా వేసవి రాజధాని మరియు ధర్మశాల శీతాకాల రాజధాని.
హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ వుంది?
హిమాచల్ ప్రదేశ్ భారతదేశం యొక్క ఉత్తర భాగంలో ఉన్న ఒక రాష్ట్రం. పశ్చిమ హిమాలయాలలో ఉన్న ఇది పదమూడు పర్వత రాష్ట్రాలలో ఒకటి మరియు దీని లక్షణం.
Read more: hindi.vaartha.com
Read Also: