ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ (Constable) తన ఇంట్లోనే ప్రియుడితో ఉన్నప్పుడు ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జంట కస్య పట్టణంలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు, ఇద్దరూ కానిస్టేబుళ్లుగా వేర్వేరు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్నారు.
ప్రియుడిని లాక్ చేసిన భార్య
ఆదివారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన భర్త, తన భార్య మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్నట్లు చూసి షాక్ అయ్యాడు. భర్తను చూసిన భార్య వెంటనే కంగారుపడి, ప్రియుడిని లోపలికి పంపించి గది తలుపు లాక్ చేసింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన భర్త బయటి వైపు నుండి తలుపుకు తాళం వేసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు చాలా కష్టపడి తలుపులు తెరిచారు. ఆశ్చర్యకరంగా, లోపల ఉన్న ప్రియుడు కూడా మరో పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
భర్త భయం, ఫిర్యాదు
పోలీసులు అక్కడికి చేరుకోగానే, భర్త లోపలున్న ప్రియుడిపై దాడికి దిగాడు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన భార్య తనకు తెలియకుండా ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంటుందని భర్త ఆరోపించాడు. భార్యతో కలిసి ఉండలేనని, ఆమె తనను ఎక్కడ చంపేస్తుందోనని భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.