కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమల్లో ఉన్న వివిధ కార్మిక చట్టాలను సమీక్షించి వాటిని ఒకే దగ్గర సమగ్రీకరించే ప్రయత్నంలో భాగంగా నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను(Labour Codes) ప్రకటించింది. వీటిలో వేతనాల కోడ్–2019, సామాజిక భద్రత కోడ్–2020, పారిశ్రామిక సంబంధాల కోడ్–2020, వృత్తి భద్రత–ఆరోగ్యం–పని పరిస్థితుల కోడ్–2020 ఉన్నాయి. ఇవి ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త కోడ్‌లు(Labour Codes) అన్ని రంగాలకు వర్తించనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కార్మికుల భద్రత, సురక్షిత వాతావరణం, అదనపు ప్రయోజనాల కోసం ఈ మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 29 కార్మిక చట్టాలు ఒకే శ్రేణిలోకి వచ్చి మరింత పారదర్శకమైన కార్మిక–ఉద్యోగ విధానాలు అమలులోకి రావనున్నాయి.
Read Also: Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన భట్టి విక్రమార్క

కార్మికుల కోసం కీలక మార్పులు
కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం, ఉద్యోగుల పని గంటలు, పని దినాలు, వేతనాలతో కూడిన సెలవుల అర్హత, ఓవర్ టైమ్ పరిమితులు, ఆరోగ్య ప్రయోజనాలు వంటి అంశాలలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మునుపటి నిబంధనల ప్రకారం, వార్షిక వేతనంతో కూడిన సెలవుకు అర్హత పొందడానికి ఉద్యోగి ఒక క్యాలెండర్ సంవత్సరంలో కనీసం 240 పని దినాలు పూర్తి చేయాలి. కొత్త కోడ్‌లు ఈ అర్హతను 180 రోజులకు తగ్గించాయి. దీతో తయారీ, టెక్స్టైల్, నిర్మాణం, రిటైల్ వంటి హాజరు నియమాలు కఠినంగా ఉండే రంగాలలో పనిచేసే వారికి ఇది పెద్ద ఉపశమనం. కార్మికులకు ముందుగానే చెల్లిన సెలవులు లభించడం వల్ల విశ్రాంతి, ఉత్పాదకత, ఉద్యోగ సంతృప్తి పెరుగుతాయని ప్రభుత్వం పేర్కొంటోంది.
పని గంటల్లో కొత్త సౌకర్యాలు
కొత్త కోడ్‌ల ప్రకారం రోజుకు 8 గంటలు మరియు వారానికి 48 గంటలు పని చేయాలనే నియమం మార్చలేదు. కానీ పని గంటలను ఎలా విభజించుకోవచ్చన్నదిలో పెద్ద సౌలభ్యం ఇచ్చారు:
- వారంలో 4 రోజులు – రోజుకు 12 గంటలు
- వారంలో 5 రోజులు – రోజుకు సుమారు 9.5 గంటలు
- వారంలో 6 రోజులు – రోజుకు 8 గంటలు
అలాగే, ఓవర్‌టైమ్ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాలకు అనుగుణంగా నిర్ణయించుకునే అవకాశం ఉంది.
ఆరోగ్య మరియు వైద్య ప్రయోజనాల్లో పెరుగుదల
కొత్త కోడ్‌లలో మరో ప్రధాన మార్పు ఆరోగ్య సేవల విస్తరణ.
- 40 ఏళ్లు దాటిన ప్రతి ఉద్యోగికి ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్ష ఏర్పాటు చేశారు.
- ప్రమాదకర వాతావరణాలు, ఎక్కువ గంటలు పని చేసే రంగాలలో ఇది ముఖ్యంగా ఉపయోగపడనుంది.
- అదనంగా, తోటల కార్మికులకు ESIC వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇవి గతంలో అందరికీ ఒకే విధంగా లభ్యం కావు.
ఈ మార్పులు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్నవని అధికారులు చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :