భారత వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (Marshal AP Singh) చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. భారత దళాలు తమ ఐదు యుద్ధ విమానాలను కూల్చేశాయన్న ఆరోపణలను పాక్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ (Khawaja Asif) భారత ఎయిర్ చీఫ్ మార్షల్ వ్యాఖ్యలను ఖండించిన అసిఫ్ఖండించారు.

“పాక్‌కు నష్టం లేదంటూ” ఖవాజా అసిఫ్ వివరణ
తాజాగా మీడియాతో మాట్లాడిన ఖవాజా అసిఫ్ (Khawaja Asif) , ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ (Pakistan) కు చెందిన ఏయే యుద్ధ విమానం కూడా దెబ్బతినలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తాము ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియాకు అప్పుడే వివరించామన్నారు. మూడు నెలల తర్వాత ఈ రకమైన ఆరోపణలు లేనివిగా అభివర్ణించారు.
ఉగ్ర శిబిరాలపై దాడులు – పాక్ బుకాయింపు?
భారత వాయుసేన ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తమ సైన్యం పూర్తిగా సురక్షితమని చెబుతూ ప్రపంచం కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ తరచూ నిజాలను దాచే ప్రయత్నమే చేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఎస్-400 వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్న ఏపీ సింగ్
ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలుగా ఉన్న S-400 క్షిపణి వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయని వెల్లడించారు.
ఐదు యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయన్న అంచనాలు
పాక్ ప్రధాన ఎయిర్‌బేస్‌లలో ఒకటైన షహబాజ్ జకోబాబాద్ స్థావరానికి తీవ్రమైన నష్టం జరిగిందని, అందులో కనీసం ఐదు యుద్ధ విమానాలు గణనీయంగా దెబ్బతిన్నాయని ఆయన అంచనా వేసారు. ఇది భారత వాయుసేనకు ఒక కీలక విజయంగా పేర్కొనొచ్చు.
90 గంటల్లో విజయవంతమైన ఆపరేషన్
ఈ ఆపరేషన్‌ను భారత వాయుసేన పూర్తిగా సూత్రబద్ధంగా, ఆల్-అవుట్ యాక్షన్ ప్లాన్‌తో నిర్వహించిందని ఏపీ సింగ్ తెలిపారు. కేవలం 80 నుండి 90 గంటల్లో లక్ష్యాలు సాధించామని ఆయన వివరించారు. పాక్ ఈ యుద్ధ ధోరణిని కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలిసి ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతుందని అన్నారు.
విమర్శల మధ్య చర్చలు?
ఈ దాడుల నేపథ్యంలో పాక్ విమర్శలు చేసినా, వారు చర్చలకు సిద్ధపడిన తీరును చూస్తుంటే, భారత్ వైపు నుంచి వచ్చిన ఆపరేషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నదనేది స్పష్టమవుతోంది. భారత్ సైనికంగా ఎంత ముందుందో ఈ సంఘటనల ద్వారా మరోసారి రుజువైంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: