కేరళలోని(Kerala) కాసర్‌గోడ్ జిల్లాలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు నిజంగానే ప్రాణాపాయంలో నుంచి బయటపడింది. ఆమె రోజూ స్కూటర్‌పై కాలేజీకి వెళ్తుంటారు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే స్కూటర్ ఎక్కి బయలుదేరారు. నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కుడి బ్రేక్ పెడల్ దగ్గర ఏదో కదులుతున్నట్టు అనిపించింది. దగ్గరగా చూసేసరికి విషపూరిత పాము ఉందని గమనించి షాక్‌కి గురయ్యారు.
Read also: Chhattisgarh Visit: పర్యటనలో ప్రధాని మోదీ – అభివృద్ధి ప్రాజెక్టుల పై దృష్టి
ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసిన విషపూరిత పాము
తైకదప్పురం ప్రాంతానికి చెందిన షర్ఫునిసా అనే ఆ టీచర్ నెహ్రూ కాలేజీలో(Nehru College)(Kerala) బోధిస్తారు. పాము కాటు వేస్తుందేమోనని భయపడ్డా, ధైర్యంగా ఇంకో కిలోమీటర్ వరకు స్కూటర్‌ను నడిపి కాలేజీకి చేరుకున్నారు. తర్వాత మెకానిక్ సహాయంతో వాహన భాగాలను విప్పించగా, లోపల దాక్కున్న పాము బయటకు వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత షర్ఫునిసా మాట్లాడుతూ — “ఇకపై స్కూటర్ దగ్గరికి వెళ్లే ప్రతీసారి భయంగా ఉంటుంది. ప్రతి సారి వాహనాన్ని వాడే ముందు చెక్ చేసుకోవాలి” అని అన్నారు.
నిపుణుల సూచన ప్రకారం అక్టోబర్ నుంచి జనవరి వరకు పాములు ఎక్కువగా సంచరిస్తాయి. ఈ సమయంలో కోబ్రా, రక్తపింజర లాంటి విషపూరిత జాతులు ఇళ్ళు, షూలు, వాహనాల్లోకి చొరబడే అవకాశముంది. కాబట్టి ప్రతీసారి వాహనాలు, పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలని స్నేక్ క్యాచర్ కేటీ సంతోష్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: