Kerala political news : కేరళలో 2025 స్థానిక సంస్థల ఎన్నికల తొలి దశ పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 26.9 శాతం ఓటింగ్ నమోదు అయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఈ తొలి దశ పోలింగ్‌లో రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లం, పఠనంతిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఆలప్పుజ, ఎర్నాకുളം జిల్లాల్లోని 595 స్థానిక సంస్థల పరిధిలోని వార్డుల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం ఎన్నికలు రెండు దశల్లో నిర్వహించనుండగా, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 11న జరగనుంది.
Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
ఈ ఎన్నికల్లో మొత్తం 1,32,83,789 మంది ఓటర్లు, (Kerala political news) 23,576 వార్డుల్లో పోటీ చేస్తున్న 75,632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అన్ని 1,199 స్థానిక సంస్థల ఫలితాలు డిసెంబర్ 13న ప్రకటించనున్నారు.
ఎల్‌డిఎఫ్ (CPI(M) నేతృత్వంలో) ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలనే ప్రధాన అంశంగా ప్రచారం చేసింది. యూడిఎఫ్ (కాంగ్రెస్ నేతృత్వంలో) అవినీతి ఆరోపణలు, పరిపాలన వైఫల్యాలపై దృష్టి పెట్టింది. బీజేపీ పక్షంలో కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్య అజెండాగా నిలిచాయి.
ఇదిలా ఉండగా, శబరిమల ఆలయ బంగారం మాయమైన కేసులో CPI(M) నేత ఏ. పద్మకుమార్ అరెస్ట్ కావడం ఎల్‌డిఎఫ్‌పై ఒత్తిడిని పెంచింది. మరోవైపు, పాలక్కాడ్ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ కూడా అంతర్గతంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంద
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కొల్లం జిల్లా కడక్కల్ గ్రామపంచాయతీ పరిధిలోని ఒక ఎస్సీ వార్డులో నిష్పక్షపాత ఎన్నికలు జరగాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ అభ్యర్థిపై బెదిరింపులు, ప్రచార సామగ్రి విధ్వంసం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: