हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Kerala: వివాహమైన కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి..మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిన జంట

Aanusha
Latest News: Kerala: వివాహమైన కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి..మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిన జంట

కేరళ (Kerala) రాష్ట్రం మరోసారి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది. సాంకేతికతను ప్రజల దైనందిన జీవితంలో అనుసంధానిస్తూ, పరిపాలనను మరింత సులభతరం చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త అధ్యాయాన్ని రాసింది. ముఖ్యంగా వివాహ రిజిస్ట్రేషన్ వంటి కీలక ప్రక్రియలు ఇప్పుడు పూర్తిగా డిజిటల్ రూపం దాల్చాయి. పెళ్లి జరిగిన అదే రోజు ఆన్‌లైన్ ద్వారా వివాహ రిజిస్ట్రేషన్ పూర్తయ్యే అవకాశం కల్పించడం ప్రజలకు నిజంగా పెద్ద సౌలభ్యం.

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి

ఇంతకుముందు పెళ్లైన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం దంపతులు స్థానిక సంస్థల కార్యాలయాలకు పలు మార్లు వెళ్లాల్సి వచ్చేది. పత్రాల ధృవీకరణ, సంతకాలు, సమయం పట్టే క్రమం వంటివి అనేక ఇబ్బందులు కలిగించేవి.

కానీ ఇప్పుడు ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడంతో ఈ మొత్తం ప్రక్రియను కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. పెళ్లి అయిన జంటలు తమ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేస్తే చాలు — రిజిస్ట్రేషన్ తక్షణమే పూర్తి అవుతుంది. ఆ తర్వాత ధృవీకరణ పత్రం కూడా అదే రోజు అందుబాటులోకి వస్తుంది.

 Kerala
 Kerala

అదే రోజు ధ్రువీకరణ పత్రం అందింది

తాజాగా ఓ జంట పెళ్లి అయిన కొద్ది నిమిషాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా.. అదే రోజు ధ్రువీకరణ పత్రం అందింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. నెటిజెన్లు అంతా కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానం (Online registration procedure) లో వధూవరులు తమ గుర్తింపు ధ్రువీకరణ (ఆథెంటికేషన్) కోసం ఎలాంటి సంక్లిష్ట ప్రక్రియలను అనుసరించాల్సిన పనిలేదు.

వారు తమ ఆధార్ ఆధారిత ఓటీపీ లేదా ఈ-మెయిల్ ఆథెంటికేషన్ (Email Authentication) ద్వారా తమ వివరాలను సులభంగా తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. ఈ ధ్రువీకరణ పూర్తయిన తక్షణమే.. వారికి డిజిటల్‌గా డౌన్‌లోడ్ చేసుకునే వీలున్న వివాహ ధ్రువపత్రం అందుబాటులోకి వస్తుంది. అయితే ఈ పద్ధతి అత్యంత సులభంగా ఉండడంతో.. అనేక మంది దీన్ని అనుసరిస్తున్నారు.

మొత్తం రిజిస్ట్రేషన్లలో దాదాపు 62 వేల 524 వివాహాల నమోదు

2024 జనవరి నుంచి 2025 సెప్టెంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 44 వేల 416 జంటలు వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకుని వివాహ ధ్రువీకరణ పత్రాన్ని పొందాయి. అయితే ఈ మొత్తం రిజిస్ట్రేషన్లలో దాదాపు 62 వేల 524 వివాహాల నమోదు కేవలం ఆన్‌లైన్ పద్ధతిలోనే జరిగింది. అంటే ఈ విధానానికి ఏ స్థాయిలో ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

చాలా రోజుల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభం అయినప్పటికీ.. ఇప్పుడు తెరపైకి రావడానికి ఓ కారణం ఉంది. ముఖ్యంగా లావణ్య, విష్ణు అనే నవ దంపతులు.. పెళ్లి రోజే ఈ డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకున్నారు. లావణ్య మెడలో తాళి కట్టిన కొద్ది నిమిషాలకే విష్ణు.. వీడియో కేవైసీ (KYC) ద్వారా కవస్సెరీలోని పంచాయతీ కార్యాలయంలో తమ వివాహాన్ని విజయవంతంగా రిజిస్టర్ చేయించుకున్నారు.

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వారికి లభించింది

ఆన్‌లైన్‌లో ప్రక్రియ పూర్తి కాగానే.. అంటే అదే రోజు దంపతుల ఫొటోలతో కూడిన వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (Marriage registration certificate) వారికి లభించింది.అయితే ఈ దంపతులు ఆన్‌లైన్‌లో తమ కేవైసీ వివరాలను వెరిఫై చేయించుకుంటుండగా.. వీడియో తీసుకున్నారు. ఆపై వివాహ ధ్రువీకరణ పత్రం పొందడం కూడా వీడియోలో చూపించారు. ఆపై దీన్ని సోషల్ మీడియాలో పెట్టగా క్షణాల్లోనే వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ కేరళ (Kerala) ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రశంసలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయడంలో కేరళ ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయ పడుతున్నారు. ఈ డిజిటల్ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్న లావణ్య, విష్ణు దంపతులను కూడా నెటిజన్లు అభినందిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ వీడియో చూసి మీకేమనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870