కేరళలో మెదడును ప్రభావితం చేసే అరుదైన వ్యాధి – నేగ్లేరియా ఫౌలేరి (Naegleria fowleri) అనే అమీబా సోకడంతో మరణాలు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 మంది మరణించగా, 67 మందికి ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలోని ఆరోగ్య శాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఈ అమీబా ఎలా వ్యాపిస్తుంది?
నేగ్లేరియా ఫౌలేరి అమీబా (amoeba)సాధారణంగా చెరువులు, సరస్సులు, నిల్వ నీటి వనరులు వంటి ప్రదేశాల్లో పెరుగుతుంది. ఈ నీటిలో ఈత కొట్టినపుడు, ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును చేరుతుంది. మెదడులోకి ప్రవేశించిన తర్వాత ఇది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను కలిగిస్తుంది. చికిత్స ఆలస్యమైతే మృతి కూడా సంభవించే ప్రమాదం ఉంది.

లక్షణాలు ఏమిటి?
ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1 నుండి 9 రోజుల లోపల కింది లక్షణాలు కనిపించవచ్చు:
- తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ కట్టినట్టుగా ఉండటం, మానసిక స్థితిలో మార్పులు, కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది
చికిత్స ఉంటుందా?
ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స పరిమితంగా ఉన్నప్పటికీ, తొందరగా గుర్తించి వైద్య సేవలు అందిస్తే కొన్ని సందర్భాల్లో కోలుకోవచ్చు. కాని ఇది అత్యంత వేగంగా వ్యాపించే ఇన్ఫెక్షన్ కాబట్టి, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ అమీబా సోకకుండా ఉండేందుకు ప్రజలు కింద పేర్కొన్న జాగ్రత్తలు తీసుకోవాలి:
- చెరువులు, సరస్సులు లేదా నిల్వ నీటిలో ఈతకు వెళ్లకూడదు.
- తప్పనిసరిగా ఈత కొట్టాల్సినప్పుడు నోస్ క్లిప్ (ముక్కుకు బిగించే క్లిప్) వాడాలి.
- బావులు, నీటి ట్యాంకులు వంటి వాటిని క్లోరిన్ ఉపయోగించి నియమితంగా శుభ్రపరచాలి.
- నిల్వ నీటిని తాకిన తర్వాత తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే వైద్యుని సంప్రదించాలి.
ప్రజలతో అధికారుల విజ్ఞప్తి
కేరళ ఆరోగ్య శాఖ అధికారులు మరియు వైద్య నిపుణులు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, అధికారికంగా ఇచ్చే సమాచారం మేరకు only చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: