kerala actor rape case : కొచ్చి సంచలనంగా మారిన కేరళ మహిళా నటీ అత్యాచార కేసులో ప్రముఖ నటుడు దిలీప్‌కు కోర్టు ఊరట ఇచ్చింది. ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు సోమవారం (డిసెంబర్ 8, 2025) ఆయనపై ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను కొట్టివేస్తూ విముక్తి ప్రకటించింది.
Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ
ఈ కేసులో ఎనిమిదవ నిందితుడిగా ఉన్న దిలీప్ కుట్ర ఆరోపణల నుంచి పూర్తిగా బయటపడ్డారు. తీర్పు వెలువడిన అనంతరం దిలీప్ మాట్లాడుతూ, “ఈ కేసులో నిజమైన బాధితుడు నేనే. ఇది పూర్తిగా నా మీద సాగిన కుట్ర” అని వ్యాఖ్యానించారు.
కేసును విచారించిన న్యాయమూర్తి హనీ (kerala actor rape case) ఎం. వర్గీస్, మొదటి నుంచి ఆరో నిందితుల వరకు దోషులుగా తేల్చగా, వారిపై శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్య నిందితుల్లో ‘పుల్సర్ సునీ’గా పిలిచే ఎన్.ఎస్. సునీల్‌తో పాటు మార్టిన్ ఆంటోనీ, బి. మణికండన్, వి.పి. విజయేశ్, వడియవాల్ సలీం అలియాస్ హెచ్. సలీం, ప్రదీప్ ఉన్నారు.
సన్నివేశం మొత్తం ఒక యువ నటిని అపహరించి, కదులుతున్న కారులో లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దిలీప్ పాత్రపై పెద్ద ఎత్తున చర్చ సాగినా, కోర్టు తుదింగా ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: